మన తిరుపతిలోనే ఈ ఘోరం: అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాస్ టోపీ

మన తిరుపతిలోనే ఈ ఘోరం: అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాస్ టోపీ

తిరుపతి జిల్లాలో ఘోరం జరిగింది. పదకవిత పితామహుడు అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాస్ టోపీ పెట్టారు గుర్తు తెలియని దుండగులు. అన్నమయ్యను అవమానపరుస్తూ శాంతా క్లాస్ టోపీ పెట్టడాన్ని హిందూ సంఘాలు తీవ్రంగా ఖండిస్తు్న్నాయి. శ్రీ వేంకటేశ్వరునికి అత్యంత ప్రియమైన భక్తుడు పదకవిత పితామహుడిని కించ పరిచేలా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రైస్తవుల అత్యుత్సాహం పనికిరాదని.. ఈ ఘటనను నిరసిస్తూ హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా చర్యలకు పాల్పడటం బాధాకరమని.. నిందితులను కఠినంగా శిక్షించాలని హిందు సంఘాలు డిమాండ్ చేశాయి.

పవన్ కళ్యాణ్ ఎక్కడ..?

అన్నమయ్య విగ్రహానికి జరిగిన అపచారాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నోరు విప్పితే సనాతన ధర్మం అని చెప్పే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. 32 వేల సంకీర్తనలతో వెంకటేశ్వర స్వామి మనసు గెలుచుకున్న అన్నమయ్య విగ్రహానికి అపచారం జరిగితే కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. 

హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్న ఈ చర్యపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‎లు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఏనాడూ ఇటువంటి ఘటనలు జరగలేదని.. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారి పవిత్రతను కాపాడిందే తప్ప దిగజార్చలేదని అన్నారు.