కొత్త సినిమా టీజర్ సామీ ఇదీ : 100 రోజుల్లో కడుపు చేయలేకపోతే.. ఇక అది లేనట్టేనా...?

కొత్త సినిమా టీజర్ సామీ ఇదీ : 100 రోజుల్లో కడుపు చేయలేకపోతే.. ఇక అది లేనట్టేనా...?

టాలీవుడ్ యంగ్ హీరో విక్రాంత్, బ్యూటిఫుల్ హీరోయిన్ చాందిని చౌదరి కలసి జంటగా నటించిన చిత్రం "సంతాన ప్రాప్తిరస్తు". ఈ సినిమాకి నూతన డైరెక్టర్ సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాతలు మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించాడు. బుధవారం చిత్ర యూనిట్ సంతాన ప్రాప్తిరస్తు టీజర్ ని రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ టీజర్ విశేషాలేంటో చూద్దాం.. 

అయితే హీరో విక్రాంత్ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా కనిపించాడు.అయితే హీరో విక్రాంత్ చాందిని చౌదరిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ ప్రెగ్నెన్సీ విషయంలో ఇబ్బందులు పడుతుంటారు. ఇదే మెయిన్ స్టోరీగా అనిపిస్తోంది. అయితే హీరో విక్రాంత్, బలగం మూవీ ఫేమ్ మురళీధర్ గౌడ్ మధ్య వచ్చే సన్నివేశాలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఇక డైరెక్టర్ తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం కామెడీ అదిరింది. ఇందులో ముఖ్యంగా విక్రాంత్, అభినవ్ బైక్ మీద వెళుతూ సాఫ్ట్ వేర్ జాబ్ చేసేవారికి బాడీ ఉంటుంది కానీ అందులోని అవయవాలు ఏవీ సరిగ్గా పని చేయవని చెప్పే డైలాగ్ ఆసక్తి రేపుతోంది. 

ALSO READ | Laila OTT: ఓటీటీలోకి విశ్వక్‍సేన్ లైలా.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

ఈ క్రమంలో 100 రోజుల్లో భార్యని ప్రెగ్నెంట్ చెయ్యడానికి,  హీరో స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి పడే పాట్లు నవ్వు తెప్పించినప్పటికీ నేటి లైఫ్ లో చాలామంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు బయటికి చెప్పుకోలేని సమస్యని ఎలివేట్ చేస్తూ తీసిన సీన్స్ ఫర్వాలేదనిపించాయి.. ముఖ్యంగా 100 రోజుల్లో భార్యని ప్రెగ్నెంట్ చేస్తేనే ఆమెపై ప్రేమ ఉన్నట్లు లేకపోతే ప్రేమ లేనట్లు అని చెప్పే డైలాగ్స్ టీజర్ కి హైలెట్ గా నిలిచాయి. మంచి కామెడీ & ఫ్యామిలీ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో కట్ చేసిన టీజర్ బాగానే ఆకట్టుకుంది.