హైదరాబాద్, వెలుగు : ప్రతిష్టాత్మక సంతోష్ ట్రోఫీ నేషనల్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ ఫైనల్ రౌండ్ హైదరాబాద్‌లో శనివారం మొదలైంది. నగరంలోని శ్రీనిధి ఫుట్ బాల్ క్లబ్ గ్రౌండ్‌లో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో మణిపూర్ 1–0తో సర్వీసెస్‌పై గెలిచింది. తమ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య తెలంగాణ..
రాజస్తాన్‌తో పోటీ పడి 1–1తో డ్రా చేసుకుంది. మూడో మ్యాచ్‌లో వెస్ట్ బెంగాల్ 3–1తో జమ్మూ కాశ్మీర్‌ను ఓడించింది. 57 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీని శాట్జ్ చైర్మన్ శివసేనారెడ్డి , ఎండీ సోనిబాలాదేవి ప్రారంభించారు.