
సప్తగిరి హీరోగా అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వంలో ఓ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ రూపొందుతోంది. కె.వై. బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల కలిసి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు. ‘పెళ్లి కాని ప్రసాద్’ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. ‘మల్లీశ్వరి’ చిత్రంలో వెంకటేష్ క్యారెక్టర్‌ని గుర్తు చేసేలా ఉన్న ఈ టైటిల్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సప్తగిరి డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో హ్యూమర్‌ను పండించేలా ఉన్నాడు.
చేతిలో ‘కట్నం వారి శాసనాల గ్రంథం’ అనే పుస్తకం చదువుతుండటం ఆసక్తి రేపుతోంది. ప్రియాంక శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ , అన్నపూర్ణమ్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ మార్చి 21న సినిమా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు.