Pelli Kani Prasad Review: మూవీ రివ్యూ.. ఫన్ బ్లాస్ట్‌‌‌‌గా సప్తగిరి 'పెళ్లి కాని ప్రసాద్'.. కథేంటంటే?

Pelli Kani Prasad Review: మూవీ రివ్యూ.. ఫన్ బ్లాస్ట్‌‌‌‌గా సప్తగిరి 'పెళ్లి కాని ప్రసాద్'.. కథేంటంటే?

సప్తగిరి హీరోగా అభిలాష్ రెడ్డి గోపిడి తెరకెక్కించిన చిత్రం ‘పెళ్లి కాని ప్రసాద్’ (Pelli Kani Prasad). కేవై బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల నిర్మించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా నేడు (మార్చి 21న) ఈ చిత్రాన్ని దిల్ రాజు విడుదల చేశాడు. మల్లీశ్వరి మూవీలో వెంకటేష్ పాత్ర పేరుతో వచ్చిన ఈ పెళ్లి కాని ప్రసాద్ ఎలాంటి హాస్యచతురత చూపించాడో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే:

మలేషియాలోని ఓ స్టార్ హోటల్‌లో 38 ఏళ్ల ప్రసాద్ (సప్తగిరి) పని చేస్తుంటాడు. అతనికి వయస్సు పెరుగుతున్న పెళ్లి అవ్వదు. అందుకు కారణం తండ్రి (మురళీధర్ గౌడ్) కు ఉన్న కట్నం ఆశ. తమ పూర్వీకుల రెండు కోట్ల కట్నం చరిత్ర విని అంతకంటే తక్కువ కట్నం తీసుకుని పెళ్లి చేసుకోకూడదని చెప్తూ వస్తుంటాడు. ఇక ఆ మాటల కారణం చేత, ప్రసాద్ కి వయసు పెరుగుతున్న పెళ్లి అవ్వదు. దాంతో ఫ్రస్టేషన్‌లోకి వెళ్తాడు.

ఈ క్రమంలో ప్రియ (ప్రియాంక శర్మ) ఫ్యామిలీ మొత్తం ఓ ఎన్నారై సంబంధం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎలాగైనా ప్రసాద్ని ట్రాప్ చేసి, పెళ్లి చేసుకుని ఫారెన్ వెళ్లడానికి రెడీ అవుతుంది. ఇక తన ఎత్తులతో తనను ప్రేమించేలా చేసుకుంటుంది. ఆపై ఇద్దరు పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తారు. అయితే, మ్యారేజ్ అయ్యాక ఎట్టి పరిస్థితుల్లో ఫారెన్ వెళ్లకూడదని ప్రసాద్ ఫిక్స్ అవుతాడు. దాంతో ప్రసాద్ వర్సెస్ ప్రియగా మారుతారు. గొడవలు ముదురుతాయి.

ALSO READ | Salaar Re Release: ప్రభాస్ vs పవన్ కళ్యాణ్.. సలార్ రీ-రిలీజ్ డే 1 అడ్వాన్స్ బుకింగ్స్లో టాప్ ఎవరు?

పెళ్లి కాని ప్రసాద్ పెళ్లైకా ఎలాంటి కష్టాలను ఫేస్ చేసాడు? అసలు ప్రసాద్ పెళ్లి తర్వాత ఇండియాలోనే ఎందుకు ఉండాలనుకున్నాడు? దానికి గల కారణం ఏంటీ? ప్రసాద్ కథ పెళ్ళాం చేతిలో మారిందా? మరింత నలిగిందా? అనేది తెలియాలంటే థియేటర్ లో సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే:

'ఏజ్ బార్ హీరో పెళ్లి కష్టాలు, ఇంట్లో భారీ కట్నం కోసం చూసే పేరెంట్స్..' ఇలా చాలా తెలుగు సినిమాల్లో చూస్తూనే వస్తున్నాం. ఆ తరహాలో ఎప్పటికీ గుర్తుండిపోయే మూవీ మల్లీశ్వరి. ఇందులో పెళ్లి కాని ప్రసాద్ గా నటించిన వెంకటేష్, ఎప్పటికీ గుర్తుండిపోయేలా పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ఈ సినిమాలో వెంకీకి వయస్సు పెరుగుతున్న, పెళ్లి కాకుండా పడే బాధలను చూస్తూ తెగ ఎంజాయ్ చేశాం.

ఇక ఈ లేటెస్ట్ 'పెళ్లి కాని ప్రసాద్' టైటిల్ చూస్తేనే అర్థమైపోతుంది. ఈ కథలో కూడా హీరోకి పెళ్లి కష్టాలుంటాయని. అయితే, టైటిల్కి న్యాయం చేస్తూనే, కట్నం అనే పాయింట్తో సప్తగిరి ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అలా ఒక్కమాటలో చెప్పాలంటే,  

‘ప్రసాద్‌‌ అనే నేను.. కట్నం శాసనాల గ్రంథంలో ఉన్న రూల్స్‌‌ అండ్‌‌ రెగ్యులేషన్స్‌‌కు గౌరవం ఇస్తూ తరతరాలుగా కట్నం విషయంలో మా కుటుంబం ఫాలో అవుతున్న షరతులకు కట్టుబడి ఉంటానని మా తాతముత్తాతల మీద ప్రమాణం చేస్తున్నా’ అంటూ సప్తగిరి చెప్పిన మాటల్లోనే సినిమా సారాంశం దాగుంది. అయితే కట్నం కోసం ఎదురుచూస్తున్న సప్తగిరికి పెళ్లి మరింత ఆలస్యమవడం హిలేరియస్‌‌గా ఉంది.

ఇందులో శాసనాల గ్రంథంలో కట్నాల గురించి తాత ముత్తాతల గురించి పొందుపరిచి ఉంటారు. కట్నం తీసుకోవడంలోని రూల్స్ రెగ్యులేషన్స్ ఆ గ్రంథంలో ఉంటాయి. అందులో ఉన్న రూల్స్ ప్రకారం కట్నం వస్తేనే పెళ్లి జరుగుతుంది. ఈ విషయంలో తండ్రీ కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా సాగాయి.  ఇది కేవలం ప్రేక్షకులు నవ్వుకోవడానికి చేసిన సినిమా మాత్రమే కాదు. స్క్రీన్‌‌ప్లే, సిట్యువేషన్ కామెడీతో ఫన్ రైడ్‌‌లా సాగే సినిమా. వెంకటేష్ కెరీర్‌‌‌‌లో ఐకానిక్ క్యారెక్టర్ పెళ్లి కాని ప్రసాదు. ఈ కథకి ఈ టైటిల్ పర్ఫెక్ట్.  ఆ టైటిల్ వెయిట్‌‌ని కాపాడేలా సప్తగిరి సినిమా ఉంది. 

ఎవరెలా చేశారంటే:

కామెడీ టైమింగ్‌లో, ఎమోషనల్ సీన్స్‌తో సప్తగిరి అలరించాడు. బలగం ఫేమ్ మురళీధర్ గౌడ్ పాత్రకు మంచి స్కోప్ ఉంది. ఆయన బాగా చేశారు. కట్నం కోసం కన్నకొడుకును ఇబ్బంది పెట్టె పాత్రలో తనదైన పాత్ర పోషించాడు. హీరోయిన్‌ ప్రియాంక్‌ శర్మ ఆకట్టుకుంది. సినిమా కథలో తనది కీలక పాత్ర అయినప్పటికి, ఆమెకు నటన పరంగా పెద్దగా స్కోప్‌ దక్కలేదు. మిగతా నటీనటులు తమ పాత్రల మేరకు కామెడీ టైమింగ్‌లో ఆకట్టుకున్నారు.

సాంకేతిక అంశాలు:

దర్శకుడు అభిలాష్ రాసుకున్న కథ అందరికీ తెలిసిన పాయింట్. కానీ, తనదైన స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేశాడు. హీరోతో పాటుగా మిగతా నటీనటుల్లో డైలాగ్స్, కామెడీ టైమింగ్‌ ఉండేలా జాగ్రత్త పడ్డాడు. సినిమాటోగ్రఫీ సుజాత సిద్దార్థ్ పనితనం బాగుంది. శేఖర్ చంద్ర పాటలు, బీజీఎమ్ మెచ్చుకోదగ్గట్టుగా ఉంది. ఎడిటర్ మధు తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. చివరగా  కథ లేకున్నా డైలాగ్స్‌తో కడుపుబ్బా నవ్వించే ప్రయత్నమే ఈ 'పెళ్లికాని ప్రసాద్'. 

  • Beta
Beta feature