ఫన్ బ్లాస్ట్‌‌‌‌గా పెళ్లి కాని ప్రసాద్

ఫన్ బ్లాస్ట్‌‌‌‌గా పెళ్లి కాని ప్రసాద్

సప్తగిరి హీరోగా నటించిన కామెడీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్ ‘పెళ్లి కాని ప్రసాద్’. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకుడు. కేవై బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల నిర్మించారు.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా మార్చి 21న ఈ చిత్రాన్ని దిల్ రాజు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. 

సప్తగిరి మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం మాకు మేము ఒక ఎగ్జామ్ రాసుకున్నాం.  నా మనస్సాక్షిగా వందకు వంద మార్కులు వేసుకున్నా.  ఆడియెన్స్ దగ్గర కూడా మంచి మార్కులు పడతాయని ఆశిస్తున్నా.  ఈ సినిమా మంచి ఫన్ బ్లాస్ట్‌‌‌‌గా ఉంటుంది. అందర్నీ  కడుపుబ్బా నవ్విస్తుంది. మా టీజర్ లాంచ్ చేసిన ప్రభాస్ అన్నకి, ట్రైలర్ రిలీజ్ చేసిన వెంకటేష్ గారికి థ్యాంక్స్​. 

ఈ సినిమాను దిల్ రాజు గారు రిలీజ్ చేయడం మా అదృష్టం’ అని చెప్పాడు.  ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ ఫన్ ఎక్స్‌‌‌‌పీరియెన్స్ ఇస్తుందని హీరోయిన్  ప్రియాంక శర్మ అంది. ఈ చిత్రం అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుందని  దర్శకుడు అభిలాష్ రెడ్డి చెప్పాడు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ  ప్రొడ్యూసర్ కేవై బాబు థ్యాంక్స్ చెప్పారు. నటీనటులు అన్నపూర్ణమ్మ, ప్రమోదిని, కిట్టయ్య పాల్గొన్నారు.