కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ పొన్నియన్ సెల్వన్ 2. ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ మూవీకి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. విక్రమ్, ఐశ్వర్యారాయ్,త్రిష,కార్తీ,జయం రవి ప్రధాన పాత్రలో వచ్చిన ఈ మూవీకి కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయి.
అయితే.. ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రలో ఓ చైల్డ్ ఆర్టిస్ట్ కనిపించి అందరి హృదయాలు దోచుకుంది. ఇప్పుడు ఎక్కడ చూసిన ఆమె గురించే చర్చ. ఇంతకీ ఆమె ఎవరా అనుకుంటున్నారా? ఆమె మరెవరో కాదు సారా అర్జున్. పేరు చెపితే కొంచం కన్ఫ్యూజ్ అవుతారేమో కానీ.. విక్రమ్ నటించిన నాన్న సినిమాలో చేసిన చిన్న పాప అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. ఈ సినిమాలో మతిస్థిమితం సరిగాలేని ఒక తండ్రి.. అతడి ప్రేమను అర్ధం చేసుకొనే కూతురుగా ఆమె నటన అద్భుతమనే చెప్పాలి. అందుకే ఈ సినిమాలో ఆమె నటనకు అవార్డులు కూడా దక్కాయి.
అయితే.. ఇప్పుడు ఆ చిన్నారి హీరోయిన్ గా మారింది. రీసెంట్ గా రిలీజైన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2లో చిన్నప్పటి ఐశ్వర్య రాయ్ గా నందిని పాత్రలో కనిపించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. నాన్న సినిమాలో విక్రమ్ కు కూతురిగా నటించిన సారా.. ఈ సినిమాలో చిన్నప్పటి విక్రమ్ కు ప్రేయసిగా కనిపించింది. ఇక ఈ సినిమా తరువాత సారాకు హీరోయిన్ గా మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ లు గట్టిగానే కనిపిస్తున్నాయి. మరి ఈ చిన్నది తెలుగులో ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో చూడాలి.