భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్, క్రికెటర్ శుభ్‌మాన్ గిల్ ప్రేమాయణం ముచ్చట్లు మరోసారి వార్తల్లో నిలిచాయి. ఇప్పటికే వీరిద్దరి ప్రేమ నిజమో..! అబద్దమో! తెలియక అభిమానులు తలలు పట్టుకుంటుంటే, సచిన్ గారాలపట్టి వారిని మరింత గందరగోళంలోకి నెట్టింది. తమ మధ్య ఏ బంధం లేదు అనేలా పైకి కనపడే ఈ అందాల భామ, ఉన్నట్టుండి గిల్ సోదరి షహనీల్ గిల్‌తో తిరుగుతూ మీడియా కంటపడింది.
ఆదివారం తెల్లవారుజామున సారా టెండూల్కర్, గిల్ సోదరి షహనీల్ ఇద్దరి కలిసి కారులో వెళ్తూ మీడియా కంటపడ్డారు. మొదట సారా కెమెరాల కంట పడకుండా ఉండటానికి ప్రయత్నించినా.. ఆ తరువాత ఫోటోలకు ఫోజులిచ్చింది. గిల్ కుటుంబంతో సారా సన్నిహితంగా మెలగడం అభిమానులకు ఆసక్తి రేకెత్తిస్తోంది. వీరిద్దరి అనుబంధం నిజమే అన్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి.
Sara and Shubman’s sister Shahneel tonight ?? #SaraTendulkar #ShubmanGill pic.twitter.com/fv37iCNXKa
— T (@Gladlyel) January 20, 2024
ఆ సారా నేను కాదు.. సారా అలీ ఖాన్
కొద్దిరోజుల క్రితం కాఫీ విత్ కరణ్ సీజన్ 8లో పాల్గొన్న సారా అలీ ఖాన్.. గిల్‌తో తనకున్న బంధం గురించి బయట ప్రపంచానికి తెలియజేసింది. అబ్బాయిలు, మీరు తప్పుగా భావించారు.. సార కా సార దునియా గలాత్ సారా కే పీచే పద హై (ప్రపంచమంతా తప్పుడు సారాను వెంబదించింది)" అని సారా అలీ ఖాన్ అన్నది. అంటే సారా అలీ ఖాన్ చెప్పిన,, ఆ సారా సచిన్ కుమార్తె అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడైనా వీరిద్దరూ తమ బంధాన్ని బయటపెడతారో.. లేదో.. చూడాలి.