ప్రముఖ టీవీ షో నటి వైభవి ఉపాధ్యాయ కన్నుమూత

ప్రముఖ టీవీ షో నటి వైభవి ఉపాధ్యాయ కన్నుమూత

ప్రముఖ టీవీ షో 'సారాభాయ్ వర్సెస్ సారాభాయ్'లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి వైభవి ఉపాధ్యాయ కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్తను నిర్మాత జేడి మజేథియా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

వైభవి ఉపాధ్యాయ చనిపోవడం చాలా దురదృష్టకరమని నిర్మాత జేడి మజేథియా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన ఉత్తర భారతదేశంలో జరిగిందని ఆయన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ప్రస్తావించారు.

"జీవితం చాలా అనూహ్యమైనది. వైభవి చాలా మంచి నటి. సారాభాయ్ vs సారాభాయ్‌లో 'జాస్మిన్' ద్వారా ప్రసిద్ధికెక్కిన ప్రియ స్నేహితురాలు వైభవి ఉపాధ్యాయ కన్నుమూశారు. ఉత్తరాదిలో ఆమె ప్రమాదానికి గురైంది. కుటుంబ సభ్యులు ఆమెను రేపు ఉదయం 11 గంటలకు ముంబైకి తీసుకువస్తారు. " అని JD మజేథియా పోస్ట్ లో రాసుకొచ్చారు. కాగా ఆమె మృతికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

వైభవి 2020లో 'ఛపాక్', 'తిమిర్' (2023)లో దీపికా పదుకొణెతో కలిసి పనిచేసింది. నటుడు ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ మే 22న ముంబైలోని అంధేరిలోని తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన కొద్ది రోజులకే వైభవి మరణ వార్త రావడం అందర్నీ విషాదంలోకి నెట్టేసింది.

https://www.instagram.com/stories/jd_majethia/3109208565280207664/