మంగపేట, వెలుగు : చదువుకునేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడంతో ములుగు జిల్లా మంగపేట మండల పరిధిలోని బుచ్చంపేట గ్రామానికి చెందిన సారగాని సతీశ్(18) ఆదివారం ఇంట్లో ఉరేసుకున్నాడు. ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సతీశ్ ఏటూరునాగారంలోని జడ్పీహెచ్ఎస్ లో టెన్త్ చదివాడు. హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. రోజూ తన గ్రామం బుచ్చంపేట నుంచి కాలేజీకి వెళ్లి వచ్చేవాడు.
రోజూ అప్అండ్డౌన్ చేయడం ఇబ్బందిగా ఉందని హాస్టల్ లో ఉండడానికి పైసలు ఇవ్వాలని తల్లిని కోరాడు. తన వద్ద పైసలు లేవని ఆమె చెప్పడంతో తన చదువు ఇక సాగుతుందో లేదోననే భయంతో మనస్తాపం చెందాడు. అర్ధరాత్రి వంట రూమ్ లో తన చెల్లి చున్నీతో వాసానికి ఉరేసుకున్నాడు. తల్లి మంగ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.