వరల్డ్ కప్ లో టీమిండియా అద్భుత విజయాలు సాధిస్తుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అదరగొడుతుంది. ఇప్పటివరకు ఓటమే లేకుండా అజేయంగా నిలిచిన ఏకైక జట్టుగా నిలిచింది. ఇంతవరకు బాగానే ఉన్న ఒక్క సమస్య మాత్రం భారత క్రికెట్ జట్టును వేధిస్తుంది. అదేంటో కాదు ఆరో బౌలర్ ఎవరనే విషయం.
ఇప్పటివరకు ఈ సమస్య ఎదురు కాకపోయినా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య గాయంతో భారత్ ఈ విషయంలో కాస్త నిర్లక్ష్యం చేసినట్టుగా కనిపిస్తుంది. ధర్మశాల వేదికగా న్యూజీలాండ్ మీద జరిగిన మ్యాచ్ లో ఐదుగురు స్పెసలిస్ట్ బౌలర్లతోనే ఆడిన రోహిత్ సేన పర్వాలేదనిపించింది. అయితే ఇలాగే కొనసాగితే భారత్ కష్టాల్లో పడడం గ్యారంటీ అంటున్నాడు భారత మాజీ సెలెక్టర్ శరణ్‌దీప్ సింగ్.
లక్నో వేదికగా ఆదివారం( అక్టోబర్ 29) ఇంగ్లాండ్ తో భారత్ తలపడబోతుంది. ఈ మ్యాచ్ లో ఆరుగురు బౌలర్లతో టీమిండియా బరిలోకి దిగాలని సూచించాడు ఈ మాజీ సెలక్టర్. "జట్టులో ఆరో బౌలర్ ఉండడం చాలా ముఖ్యం. బుమ్రాకు బౌలింగ్ లో కొత్తరం గ్యారంటీ ఏంటి? జట్టులో ఎవరైనా భారీగా పరుగులిస్తే కోహ్లీ లాంటి వ్యక్తి అవసరం. బౌలర్ల సహాయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, రవిచంద్రన్ అశ్విన్‌ని తీసుకురావాలా వద్దా అని భారత్ ఆలోచిస్తోంది. అన్ని విధాలుగా సిద్ధంగా ఉంటేనే విజయం దక్కుతుంది". అని ఈ మాజీ సెలక్టర్ సూచించాడు.
ALSO READ : మరో 24 గంటల్లో మ్యాచ్.. కూలిన ఈడెన్ గార్డెన్స్ గోడ