వేసవి వినోదాల సారంగపాణి జాతకం ఏప్రిల్ 18న విడుదల

వేసవి వినోదాల సారంగపాణి జాతకం ఏప్రిల్ 18న విడుదల

ఇటీవల ‘కోర్ట్‌‌’ లాంటి సెన్సిటివ్ సబ్జెక్ట్‌‌ మూవీతో సూపర్ హిట్ అందుకున్న ప్రియదర్శి.. త్వరలో హిలేరియస్‌‌గా నవ్విస్తానంటున్నాడు.  అతను హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సారంగపాణి జాతకం’ సినిమా రిలీజ్‌‌ డేట్‌‌ను సోమవారం ప్రకటించారు.  ఏప్రిల్‌‌ 18న థియేటర్స్‌‌లో విడుదల చేయబోతున్నట్టు చెప్పారు.  

వేసవిలో ఇంటిల్లిపాదిని కడుపుబ్బా నవ్వించేలా వినోదాత్మకంగా మోహనకృష్ణ తెరకెక్కించారని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఈ సందర్భంగా తెలియజేశారు.  ప్రియదర్శికి జంటగా తెలుగమ్మాయి రూప కొడువాయూర్ హీరోయిన్‌‌గా నటించింది. 

వీకే నరేష్, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిశోర్, వైవా హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్, రాజా చెంబోలు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.  వివేక్ సాగర్ సంగీతం అందించాడు.