లేట్ అయినా లేటేస్ట్‎గా.. ప్రియదర్శి సారంగపాణి మూవీ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్

లేట్ అయినా లేటేస్ట్‎గా.. ప్రియదర్శి సారంగపాణి మూవీ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్

ప్రియదర్శి, రూప కడువయూర్ జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’.  శనివారం ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌‌‌‌‌‌‌‌ని అనౌన్స్ చేశారు.  వాస్తవానికి ఈ నెల 18న విడుదల కావాల్సిన ఈ సినిమాను  మరో వారం వాయిదా వేస్తూ ఏప్రిల్ 25న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘కంప్లీట్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్ తీయాలనే నా కోరిక ఈ సినిమాతో నెరవేరింది.  ఫస్ట్ కాపీతో సహా సినిమా రెడీ అయ్యింది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. 

ఈనెల 18న విడుదల చేద్దామనుకున్నాం. అయితే బయ్యర్ల సూచన మేరకు, మరిన్ని మంచి థియేటర్ల సౌలభ్యత కోసం ఒక వారం పోస్ట్ పోన్ చేసి ఈనెల 25న రిలీజ్‌‌‌‌‌‌‌‌కు సన్నాహాలు చేస్తున్నాం. ఆలస్యమైనా రెట్టింపు ఆనందాన్ని కలిగించేలా మా సినిమా ఉంటుంది.  బలగం , 35, కోర్టు  సినిమాలతో ప్రియదర్శి రేంజ్ పెరిగింది.  ఈ సినిమాతో వందశాతం ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్ చేస్తారాయన’ అని చెప్పారు.  నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిశోర్, వైవా హర్ష  తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించాడు.  ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌‌‌‌‌‌‌‌కు  మంచి రెస్పాన్స్ వచ్చింది.