
ప్రియదర్శి హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి రూపొందిస్తున్న చిత్రం 'సారంగపాణి జాతకం'. రూప కడువయూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఈ చిత్రం వేసవి సెలవులో నవ్వులు పంచడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఈ సందర్భం గా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ వేసవి సెలవుల్లో కుటుంబమంతా కలిసి వెళ్ళి చూసే పరిపూర్ణ హాస్యరస చిత్రం మా 'సారంగపాణి జాతకం!.
సూటింగ్‌తో పాటు డబ్బింగ్ కూడా పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. మనిషి భవిష్యత్తు చేతి రేఖలో ఉంటుందా? లేదా చేసే చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకు జవాబు ఇస్తూనే ఇంటిల్లిపాదిని కడుపుబ్బా నవ్వించే వినోదాత్మక చిత్రమిది అని అన్నారు. నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి. శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిశోర్, వైవా హర్ష తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.