- సెర్ప్ ఆధ్వర్యంలో 250 స్టాల్స్ ఏర్పాటు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో సెర్ప్ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 7 వరకు సరస్మేళా నిర్వహించేందుకు అధికా రులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలు తయారీ చేసిన ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకం కోసం నిర్వహిస్తున్న ఈ మేళాలో తెలంగాణ తోపాటు వివిధ రాష్ట్రాల నుంచి ఉత్పత్తిదారులు పాల్గొననున్నారు. వారి కోసం దాదాపు 250 స్టాల్స్ ఏర్పాటు చేశారు. స్టాల్స్కోసం రిజిస్టేషన్నిర్వహిస్తున్నారు.
మేళాలో ఏర్పాటు చేసిన స్టాల్స్ లో ఎస్‌హెచ్‌జీ మహిళలు తయారు చేసిన వస్తువులను అమ్మనున్నారు. ప్రధానంగా చేనేత ఉత్పత్తులు, హ్యాండ్ క్రాఫ్ట్స్, వెదురు, తుంగతో తయారీ చేసిన వస్తువులు, సిక్కీ క్రాఫ్ట్స్, కోయ బొమ్మలు, టెర్రకోట ( గృహ అలంకరణ), లోహ వస్తువులు, మట్టి గాజులు, చేర్యాల పెయింటింగ్స్, నిర్మల్ బొమ్మలు ప్రదర్శించనున్నారు.
ల్క్, కాటన్, కాంతా సారీస్, హ్యాండ్లూమ్ల్ క్లాత్స్, పోచంపల్లి ఇక్కత్, గద్వాల్, నారాయణపేట గొల్లబామ చీరలు, డరీస్ తెలంగాణకు చెందిన హ్యాండ్లూమ్స్ ప్రదర్శించనున్నారు.