బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలిగా సరస్వతి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలిగా చిర్రా సరస్వతిని నియమించినట్టు బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ తెలిపారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని పార్టీ జిల్లా ఆఫీస్​లో మంగళవారం జరిగిన ప్రోగ్రాంలో సరస్వతికి నియామక పత్రాన్ని ఆయన అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి కోసం కృషి చేయాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. 

రాష్ట్రపతి పదవిని మహిళలకు కట్టబెట్టిన ఘనత బీజేపీకే దక్కిందన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆరోపించారు. ఈ ప్రోగ్రాంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యడ్లపల్లి శ్రీనివాసరావు, ఓబీసీ జిల్లా మోర్చా అధ్యక్షుడు ఆకుల నాగేశ్వరరావు, కిసాన్​ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోనేరు నాగేశ్వరరావు, లీడర్లు సుచిత్ర పాసి, పెద్దబోయిన సునీత, సుమలత పాల్గొన్నారు.