- దుండగులను శిక్షించాలని రోడ్డుపై బైఠాయించిన స్టూడెంట్స్
నిజాంపేట, వెలుగు : మండలంలోని నార్లాపూర్ జడ్పీ హైస్కూల్ లో సరస్వతీ దేవి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు సోమవారం రాత్రి ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు, స్టూడెంట్స్, గ్రామస్తులు మంగళవారం కల్వకుంట పులిమామిడి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇదే స్కూల్ లో ఇంతకు ముందు క్లాస్ రూమ్ ల కిటికీలు పగలగొట్టి, కంప్యూటర్లను ఎత్తుకెళ్లారని, ట్యాబ్ లను పగలగొట్టారని స్టూడెంట్స్ తెలిపారు.
స్కూల్ లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఘటనా స్థలానికి ఏఎస్ ఐ జైపాల్ రెడ్డి పోలీస్ సిబ్బంది తో వచ్చి వారం రోజుల్లో దుండగులను పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు ప్రశాంత్, చందు, మనోహర్, కుమార్, మాజీ ఉప సర్పంచ్ మధు, వెంకటేశం, ప్రణయ్ కుమార్ పాల్గొన్నారు.