
న్యూఢిల్లీ: ఇండియా వెటరన్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ శరత్ కమల్‌కు అరుదైన గౌరవం లభించింది. పారిస్ ఒలింపిక్స్‌లో అతను ఇండియా ఫ్లాగ్‌బేరర్‌గా ఎంపికయ్యాడు. బాక్సింగ్ లెజెండ్ ఎంసీ మేరీకోమ్‌ను ఈ టోర్నీలో పోటీపడే ఇండియా బృందానికి చెఫ్ డె మిషన్‌గా నియమించినట్టు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) గురువారం ప్రకటించింది. మాజీ ఒలింపియన్ శివ కేశవన్‌ను డిప్యూటీ చెఫ్ డె మిషన్‌గా ఎంపిక చేసింది. మాజీ షూటర్ హైదరాబాదీ గగన్ నారంగ్‌కు ప్రధాన వేదికలకు చాలా దూరంగా ఉన్న షూటింగ్ రేంజ్‌లో ఇండియా ఆపరేషన్స్‌ను పర్యవేక్షించే బాధ్యతలను అప్పగించింది.