నామినేషన్​ ప్రక్రియలో ఇబ్బందులు ఉండొద్దు: శరత్​కుమార్

నామినేషన్​ ప్రక్రియలో ఇబ్బందులు ఉండొద్దు: శరత్​కుమార్

జోగిపేట, వెలుగు: నామినేషన్​ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దని జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ శరత్​కుమార్​ సూచించారు. మంగళవారం ఆందోల్​ ఎన్నికల రిటర్నింగ్​ అధికారి కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నామినేషన్​ ప్రక్రియ వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు.  

నారాయణ్ ఖేడ్: పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియను కలెక్టర్ శరత్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ వద్ద తగు సూచనలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటేశ్​, సహాయ అధికారి దేవదాస్, డీఎస్పీ వెంకటరెడ్డి ఉన్నారు.