పర్స్​నల్​లైఫ్​వద్దా?.. సుబ్రమణియన్​కామెంట్స్‌‌పై నెటిజన్ల రచ్చ

న్యూఢిల్లీ: వారానికి 90 గంటలు పనిచేయాలని, కుదిరితే ఆదివారం కూడా ఆఫీస్‌‌‌‌‌‌‌‌కు రావాలని ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌ సుబ్రమణియన్ చేసిన కామెంట్స్‌‌‌‌‌‌‌‌పై సోషల్ మీడియాలో విమర్శలు పెరిగాయి. పాపులర్ ఇండస్ట్రియలిస్ట్‌‌‌‌‌‌‌‌లు, బాలీవుడ్ నటులు బయటకొచ్చి ఆయన్ని విమర్శిస్తున్నారు. 

‘వారానికి 90 గంటలా? సండేని సన్‌‌‌‌‌‌‌‌– డ్యూటీగా ఎందుకు మార్చేయకూడదు. డే–ఆఫ్‌‌‌‌‌‌‌‌ను జోక్‌‌‌‌‌‌‌‌గా ఎందుకు మార్చేయకూడదు? కష్టపడాలి. తెలివిగా పనిచేయాలి. ఈ సిద్ధాంతాన్నే నమ్ముతాను. కానీ, లైఫ్‌‌‌‌‌‌‌‌ మొత్తం ఆఫీసే ఉంటే వచ్చే ఫలితం సక్సెస్ కాదు. వర్క్–లైఫ్ బ్యాలెన్స్ ఆప్షనల్ కాదు. 

అత్యవసరం’ అంటూ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్‌‌‌‌‌‌‌‌ గోయెంకా ట్విట్‌‌‌‌‌‌‌‌ చేశారు.  ఉద్యోగి వారానికి 90 గంటలు పనిచేస్తే, అతనికి బయట ఎటువంటి లైఫ్ ఉంటుందని  ఫస్ట్ గ్లోబల్‌‌‌‌‌‌‌‌ ఎండీ దేవినా మెహ్రా ప్రశ్నించారు. దేశ నిర్మాణానికి కష్టపడి పనిచేయాలని చెప్పే ఇలాంటి సలహాలు అసలు అర్ధంపర్దం లేనివని అన్నారు. 

‘భార్యను ఎంత సేపు చూస్తావ్‌? ఆఫీస్‌కొచ్చి పనిచేయ్‌’ అని సుబ్రమణియన్ చేసిన వ్యాఖ్యలపై బాడ్మింటన్ స్టార్ జ్వాల గుత్తా మండిపడ్డారు. ఉద్యోగి తన వైఫ్‌‌‌‌‌‌‌‌ను ఎందుకు చూడకూడదని ఆమె ప్రశ్నించారు. ఆయన స్త్రీద్వేషి అని విమర్శించారు.  

మరోవైపు  ఎల్ అండ్ టీ మాత్రం సుబ్రమణియన్ కామెంట్స్‌‌‌‌‌‌‌‌కు మద్దతుగా నిలిచింది. అసాధారణమైన ఫలితాలు రావాలంటే, అంతే స్థాయిలో పనిచేయాలనే ఉద్దేశంతో సుబ్రమణియన్ అలా అన్నారని వివరణ ఇచ్చింది. వీరు పరిస్థితిని మరింత వరెస్ట్‌‌గా మార్చారని దీనికి రెస్పాన్స్‌‌గా బాలీవుడ్ నటి దీపిక పదుకొణె పేర్కొన్నారు.