సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చరిత్ర అందరూ తెలుసుకోవాలి

సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చరిత్ర అందరూ తెలుసుకోవాలి

హైదరాబాద్,వెలుగు: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి ఉత్సవ సభను ఈ నెల 16న నిర్వహిస్తున్నామని తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాలరాజ్ గౌడ్ పేర్కొన్నారు. చిక్కడపల్లిలోని  ఆఫీసులో శనివారం ఆయన  మీడియాతో మాట్లాడుతూ.. సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నారు. జయంతి సభ కోసం డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎంపీలు మధుయాష్కి గౌడ్, బూర నర్సయ్య గౌడ్, మల్లు రవి, అంజన్ కుమార్ యాదవ్, ఇతర ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందజేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గౌడ్​లు, బహుజనులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర కన్వీనర్ ఆయిలి వెంకన్న, వర్కింగ్ చైర్మన్ ఎలికట్ట విజయ్ కుమార్   తదితరులు పాల్గొన్నారు.