కోల్‌బెల్ట్/కడెం/దహెగాం, వెలుగు: మందమర్రి పట్టణంలోని రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో మంగళవారం సర్దార్‌సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని నిర్వహించారు. జిల్లా గౌడ సంఘం ఉపాధ్యక్షుడు నోముల ఉపేందర్ గౌడ్, జనరల్ సెక్రటరీ మడిపల్లి వెంకటేశ్ గౌడ్ మాట్లాడుతూ.. బహుజన రాజ్యాన్ని స్థాపించిన తొలి పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అన్నారు. ఆయన ఆశయాలను గౌడ కులస్తులు కొనసాగించాలని పిలుపునిచ్చారు.
జమీందార్లు, జాగీర్దాల అరాచకాలను సహించలేక కత్తి పట్టిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కడెం మండల గౌడ సంఘం నాయకులు అన్నారు. పాపన్న గౌడ్ 314వ వర్ధంతిని పురస్కరించుకొని కడెం మండల కేంద్రంలోని పాపన్న గౌడ్ విగ్రహం వద్ద నివాళి అర్పించారు. బహుజన వాదంతో కూడిన ఆయన ఆశలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. గౌడ సంఘం నాయకులు, కులస్తులు తదితరులు పాల్గొన్నారు. దహెగాం మండలంలోని హత్తిని గ్రామంలో గౌడ కులస్తులు సర్వాయి పాపన్న వర్ధంతిని జరుపుకున్నారు. ఆయన ఫొటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సింగిల్ విండో చైర్మన్ కోండ్ర తిరుపతి గౌడ్, రాజగౌడ్, గంగాధర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.