ఏడు జిల్లాల్లో ఎన్ని చెరువులున్నయ్?

ఏడు జిల్లాల్లో ఎన్ని చెరువులున్నయ్?
  • హెచ్​డీఎంఏ కమిషనర్ సర్ఫరాజ్

హైదరాబాద్, వెలుగు: హెచ్ఎండీఏ పరిధిలోని ఏడు జిల్లాల్లో చెరువుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. నవంబర్​నాటికి ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిమిలినరీ, ఫైనల్ నోటిఫికేషన్లపై కలెక్టర్లతో చర్చించారు.

ఈ సందర్భంగా కలెక్టర్లు తమ జిల్లాల పరిధిలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి నిర్వహించిన సర్వే వివరాలను అందజేశారు. ఆయా జిల్లాల పరిధిలోని చెరువుల ఫైనల్​నోటిఫికేషన్ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్లను కమిషనర్ ఆదేశించారు.