![Champions Trophy 2025: ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు ఆ మూడు జట్లు సెమీస్‌కు వెళ్తాయి: మాజీ విన్నింగ్ కెప్టెన్](https://static.v6velugu.com/uploads/2025/02/sarfaraz-ahmed-predicts-his-semi-finalists-for-the-icc-champions-trophy-2025_lDaUjmk76X.jpg)
క్రికెట్ అభిమానులను అలరించడానికి ఛాంపియన్స్ ట్రోఫీ సిద్ధంగా ఉంది. మరో వారం ఐదు రోజుల్లో ప్రారంభం కానున్న ఈ టోర్నీపై భారీ అంచనాలు ఉన్నాయి. 2017 తర్వాత దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. వన్డే ఫార్మాట్ లో టాప్ 8 జట్లు ఆడే ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు జరుగుతుంది. పాకిస్తాన్,దుబాయ్ వేదికలుగా ఈ మెగా టోర్నీ జరగనుంది. పాకిస్థాన్ లోని లాహోర్, కరాచీ, రావల్పిండి ఎనిమిది జట్లు ఆడే ఈ టోర్నమెంట్‌లో మొత్తం 10 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
పాకిస్తాన్,దుబాయ్ వేదికలుగా ఈ మెగా టోర్నీ జరగనుంది. పాకిస్థాన్ లోని లాహోర్, కరాచీ, రావల్పిండి ఎనిమిది జట్లు ఆడే ఈ టోర్నమెంట్‌లో మొత్తం 10 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. భారత జట్టు పాల్గొనే మ్యాచ్‌లు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ గ్రూప్ ఏ లో ఉండగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ బి లో ఉన్నాయి. ఈ టోర్నీకి ముందు 2017 ఛాంపియన్స్ ట్రోఫీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఈ మెగా టోర్నీ గురించి తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నాడు.
"పాకిస్తాన్ టైటిల్‌ను నిలబెట్టుకోవడానికి నిజంగా మంచి అవకాశం. పాకిస్థాన్ కు బలమైన జట్టు ఉందని నేను భావిస్తున్నాను. 2017 నుండి కొంతమంది కుర్రాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ముఖ్యంగా బాబర్ ఆజం ఈ టోర్నీలో కీలక పాత్ర పోషిస్తాడు. పాకిస్థాన్ పై సహజంగానే ఒత్తిడి ఉంటుంది. పాకిస్తాన్ స్వదేశంలో ఆడడం.. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉండటం వల్ల ఎక్కువగా అంచనాలు ఉంటాయి. అయితే వారికి అభిమానుల మద్దతు ఉండడం సానుకూలాంశం. సెమీ ఫైనల్స్ కు పాకిస్తాన్, ఇండియా, ఆస్ట్రేలియాతో పాటు ఆఫ్ఘనిస్తాన్ అర్హత సాధిస్తుంది". అని సర్ఫరాజ్ తెలిపాడు.