పూణే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ బ్యాటర్ తన అద్భుతమైన రివ్యూతో వికెట్ సంపాదించాడు. తొలి రోజు తొలి సెషన్ లో భాగంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 24 ఓవర్ చివరి బంతిని అశ్విన్ లెగ్ సైడ్ దిశగా వేశాడు. ఈ బంతిని ఫ్లిక్ షాక్ ఆడదామనుకున్న యంగ్ షాట్ ఆడడంలో విఫలమయ్యాడు. దీంతో బంతి వెళ్లి వికెట్ కీపర్ రిషప్ పంత్ చేతిలో పడింది.
బంతి ఎడ్జ్ తాకినట్టు అనిపించడంతో భారత ఆటగాళ్లు అంపైర్ కు అప్పీల్ చేశారు. అయితే అంపైర్ మాత్రం నాటౌట్ అని తల అడ్డంగా ఊపాడు. ఈ సమయంలో భారత్ రివ్యూకు వెళ్లాలా వద్దా అనే సందిగ్ధంలో పడింది. వికెట్ కీపర్ పంత్ అంత కాన్ఫిడెంట్ గా లేడు. దీంతో రోహిత్ రివ్యూకు వెళ్ళడానికి ఆసక్తి చూపించలేదు. తే షార్ట్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తున్న సర్ఫరాజ్ బ్యాట్ ఎడ్జ్ కు తాకిందని రివ్యూ తీసుకోవాలని కెప్టెన్ రోహిత్ కు చాలా కాన్ఫిడెంట్ గా సూచించాడు. సర్ఫరాజ్ చాలా నమ్మకంగా చెప్పడంతో రోహిత్ రివ్యూకు వెళ్ళాడు.
Also Read : ముగిసిన తొలి సెషన్.. భారత్‌ను అడ్డుకున్న కాన్వే
రీప్లేలో బంతి బ్యాట్ ఎడ్జ్ తాకినట్టు స్పష్టంగా కనిపించింది. దీంతో విల్ యంగ్ 18 పరుగుల వద్ద ఔటయ్యాడు. రోహిత్ ను సర్ఫరాజ్ ఒప్పించినా విధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే తొలి రోజు లంచ్ సమయానికి న్యూజి లాండ్ రెండు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. క్రీజ్ లో కాన్వే (47), రచీన్ రవీంద్ర (5) ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్ కు రెండు వికెట్లు దక్కాయి.
in #2nd_Test
— A. Wahid (@A__Wahid) October 24, 2024
Keeper Bowler Captain kisi ko nahi Suna
Sarfaraz khan Bola Please Mujh Par Bharosa Karo.#INDvsNZ pic.twitter.com/wkyTUNmMqp