
న్యూఢిల్లీ : ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో అరంగేట్రం చేసి అదరగొట్టిన టీమిండియా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, కీపర్ ధ్రువ్ జురెల్‌కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు ఇచ్చింది. నిబంధనల మేరకు మూడు టెస్టులు ఆడటంతో ఈ ఇద్దరినీ ఏడాదికి కోటి రూపాయల ఫీజుతో సెంట్రల్ కాంట్రాక్ట్‌లోని గ్రూప్– సిలో చేర్చింది. ఈ మేరకు సోమవారం జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో వీరి పేర్లను ఆమోదించారు. వచ్చే రంజీ ట్రోఫీ సీజన్ క్యాలెండర్‌ను మార్చే విషయంపై అపెక్స్ కౌన్సిల్‌లో బోర్డు పెద్దలు చర్చించారు. ఇక, ఎక్స్‌పోజర్ ట్రిప్‌ల కోసం ఇండియాకు వచ్చే ఫారిన్ బోర్డులతో బీసీసీఐ అనుబంధ క్రికెట్ సంఘాలు నేరుగా సంప్రదింపులు జరపకూడదని అపెక్స్ కౌన్సిల్ నిర్ణయించింది. ఇందుకోసం బోర్డు నుంచి ఎన్‌ఓసీ తీసుకోవాలని స్పష్టం చేసింది.