హైదరాబాద్, వెలుగు: ఫార్మా సంస్థ బేయర్, మహిళల ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకుని సారిడాన్ ఉమెన్‌ను ప్రవేశపెట్టింది. నెలసరి సమయంలో తలనొప్పి, శరీరనొప్పుల నుంచి మహిళలకు ఉపశమనం పొందేందుకు ఈ మందు సాయపడుతుంది.
బేయర్ ఇండియా ఎండీ, సీఈఓ, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సారిడాన్ ఉమెన్ మహిళల జీవిత నాణ్యతను మెరుగుపర్చుతుందని వివరించారు. సారిడాన్ ఫార్ములేషన్‌ను వరల్డ్ గైనకాలజిస్ట్స్ అసోసియేషన్, రాయల్ కాలేజ్ ఆఫ్ అబ్స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ సిఫార్సు చేసిందని బేయర్తెలిపింది.