బెంగళూరు: సరిగమప ఫేమ్ సింగర్ సుబ్రమణి భార్య జ్యోతి తన పుట్టింట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేఆర్పురలోని పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సుబ్రమణి కి కోలార్ ధర్మరాయనగర్ కు చెందిన జ్యోతితో 14 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సరిగమప టీవీ షో ద్వారా పాపులర్ అయిన సుబ్రమణి సింగర్ సుబ్రమణిగా మారాడు. గత కొంత కాలంగా భార్యాభర్తల మధ్య గత కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తన పుట్టింటికి వెళ్లిన జ్యోతి నిన్న సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి తాడు బిగుంచుకుని ఆత్మహత్యా యత్నం చేసింది. సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి తాడు బిగించుకుని స్టూల్ ను తన్నేయగానే శబ్దాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. శ్వాస సంబంధ ఇబ్బంది తలెత్తడంతో మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా ఎక్కడా బెడ్లు ఖాళీగా లేవని చేర్చుకోలేదు. దీంతో హోస్కోటలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమించడంతో వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జ్యోతి తుదిశ్వాస విడిచింది. తన భార్య ఆత్మహత్యపై భర్త సింగర్ సుబ్రమణి మీడియాతో మాట్లాడుతూ తమ మధ్య ఎటువంటి గొడవలు లేవని, ఆమెకు కరోనా రావటంతోటే భయపడి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని తెలిపాడు. జ్యోతి దగ్గర ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని సమాచారం. కుటుంబ సభ్యులు కూడా ఆమె భర్త గాని మరెవరిపైనా ఆరోపణలు చేయకపోయినా పోలీసులు అసహజ మరణం కింద కేసు నమోదు చేశారు.
సరిగమప ఫేమ్ సింగర్ భార్య ఆత్మహత్య
- దేశం
- May 14, 2021
లేటెస్ట్
- వైష్ణవి మాయ..అరంగేట్రం మ్యాచ్‌లోనే హ్యాట్రిక్ సహా 5 వికెట్లు
- ఆరు రోజుల ట్రీట్మెంట్ తర్వాత..సైఫ్అలీఖాన్ డిశ్చార్జ్
- గ్లోబల్ లీడర్స్‌గా..భారత సంతతి బాసులు
- మహాకుంభమేళా..9 రోజుల్లో 9 కోట్ల మంది పుణ్యస్నానాలు
- చట్టాల ఆమోదంలో తెలంగాణ అసెంబ్లీరోల్ మోడల్
- కూతురిని హత్య చేసిన తండ్రి .. సంగారెడ్డి జిల్లాలో బాలిక మృతి కేసును ఛేదించిన పోలీసులు
- భార్యను చంపిన భర్తకు జీవిత ఖైదు
- కండ్లన్నీ షమీపైనే..నేడు ఇంగ్లండ్‌తో ఇండియా తొలి టీ20 మ్యాచ్
- ట్రంప్ కేబినెట్లో తొలి నియామకం..విదేశాంగ మంత్రిగా రూబియో
- జనవరి 24న జీబీ లాజిస్టిక్స్ ఐపీఓ
Most Read News
- ఇదేందయ్యా ఇది.. రైలును ఆపేసి పట్టాలపై ప్రయాణికుల ఆందోళన
- IND vs ENG: ఇంగ్లాండ్‌తో తొలి టీ20.. భారత్ తుది జట్టు ఇదే
- WHOకు గుడ్ బై.. వర్క్ ఫ్రం హోం రద్దు.. అమెరికాలో పుడితే పౌరసత్వం ఇవ్వరు : ట్రంప్ సంచలన నిర్ణయాలు
- మదగజరాజా రూ.40 కోట్ల బాక్సాఫీస్: విశాల్ పది రోజుల ముందు.. ఆ తర్వాత మార్పు చూశారా
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు గుండెపోటు
- సారీ.. క్షమించండి: నాగచైతన్య, శోభిత విడాకుల వ్యాఖ్యలపై వేణుస్వామి క్షమాపణ
- Allu Arjun: ఫ్యామిలీతో అల్లు అర్జున్.. ఫోటోలు షేర్ చేసిన భార్య స్నేహారెడ్డి
- IND vs ENG: నలుగురు పేసర్లతో బట్లర్ సేన.. భారత్‌తో తొలి టీ20కి ఇంగ్లాండ్ జట్టు ప్రకటన
- హైదరాబాద్‌లో రైల్వే పట్టాలపై ఓయూ విద్యార్థిని ఆత్మహత్య
- సూర్యాపేట గ్రామ సభలో రసాభసా.. అధికారులను నిలదీసిన గ్రామస్థులు