Today Release Movies: నేడు థియేటర్లలో రిలీజైన సినిమాలివే..ఆడియన్స్ అంచనాలు మించేలా!

Today Release Movies: నేడు థియేటర్లలో రిలీజైన సినిమాలివే..ఆడియన్స్ అంచనాలు మించేలా!

వీకెండ్ వచ్చిందంటే మాస్, క్లాస్, ఫ్యామిలీ ఆడియన్స్ కు థియేటర్లో పండుగనే చెప్పుకోవాలి. గురు, శుక్ర, శని వారాలు వస్తున్నాయంటే థియేటర్లో ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ఏ సినిమా ఎలాంటి అంచనాలు కలిగి ఉంది..ఎంత కంటెంట్ తో నిండి ఉంది..అనే ఆలోచనలు మొదలవుతాయి.ఇక సినిమా మంచిగా ఉందంటే ప్రేక్షకుల ఆనందం అంతా థియేటర్లో కాగితాల రూపంలో తెరపై విసురుతూ ఆ హ్యాపీనెస్ ను పొందుతారు. మరి ఈ వీకెండ్ ఎలాంటి సినిమాలు వస్తున్నాయి. నేడు గురువారం పలకరించిన సినిమాలేంటో చూద్దాం. 

Also Read:-నాని, ఎస్ జే సూర్యల మాస్ బొమ్మ‌ ఎలా ఉందంటే?

సరిపోదా శనివారం

అంటే సుంద‌రానికి త‌ర్వాత నాని, డైరెక్ట‌ర్ వివేక్ ఆత్రేయ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన స‌రిపోదా శ‌నివారం మూవీ గురువారం ఆగస్ట్ 29న పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజైంది.ఈ సినిమా ఓవ‌ర్‌సీస్ ప్రీమియ‌ర్స్ పూర్త‌య్యాయి. స‌రిపోదా శ‌నివారం సినిమాకి పబ్లిక్ నుండి టాక్ అదిరిపోయింది. నాని, ఎస్‌జే సూర్య క‌లిసి స్క్రీన్‌పై క‌నిపించే ప్ర‌తి సీన్ మాస్ బొమ్మల అదిరిపోతుంద‌ని టాక్ ఉంది.హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్‌తో పాటు ఇంట‌ర్వెల్ ట్విస్ట్‌, క్లైమాక్స్ యాక్ష‌న్ ఎపిసోడ్ గూస్‌బంప్స్‌ను క‌లిగిస్తాయ‌ని చెబుతోన్నారు. రేసీ స్క్రీన్‌ప్లే, హై ఇంటెన్స్‌ యాక్ష‌న్ ఎపిసోడ్స్‌తో చివ‌రి వ‌ర‌కు సినిమా థ్రిల్లింగ్‌ను పంచుతుంద‌ని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆలస్యం ఎందుకు నాని సినిమాని థియేటర్లలలో చూసి ఎంజాయ్ చేయండి. 

మాస్ రీ రిలీజ్ 

అక్కినేని నాగార్జున పుట్టినరోజు ఆగ‌ష్టు 29 సంద‌ర్భంగా..అక్కినేని ఫ్యాన్స్ కోరిక మేరకు నాగార్జున మాస్ మూవీని థియేటర్లలలో రీ రిలీజ్ చేశారు. లారెన్స్ ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున కెరీర్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న మాస్ సినిమాను కింగ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆగ‌ష్టు 28,29 తేదీల్లో 4కెలో ‘మాస్‌’ను రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రదర్శించబడుతుంది. 

వర్మ అప్డేట్ 

మాస్ సినిమా రీరిలీజ్ కావడంతో అక్కినేని ఫ్యాన్స్ సినిమా చూడడానికి థియేటర్ల వద్ద హుషారైన సందడి చేస్తున్నారు. అలాగే ఈ  సినిమా సమయంలో నాగార్జున ఫ్యాన్స్ కు మరో అద్భుతమైన అప్డేట్ ఇచ్చారు.అదేంటంటే..నాగ్, వర్మ కలయికలో వచ్చిన ఇండస్ట్రీ ట్రెండ్ సెట్టింగ్ భారీ బ్లాక్ బస్టర్ చిత్రం శివ సినిమాను కూడా అతి త్వరలో రీరిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. తాజాగా శివ సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఆ వీడియోని సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

అహో విక్రమార్క

పలు చిత్రాల్లో విలన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఆకట్టుకున్న దేవ్ గిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అహో విక్రమార్క’. త్రికోటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. చిత్రా శుక్లా హీరోయిన్. దేవ్ గిల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఆయన భార్య ఆర్తి నిర్మిస్తున్నారు.ఈ మూవీ శుక్రవారం ఆగస్టు 30న రిలీజ్ కానుంది. దేవ్‌గిల్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించారు. అసుర రాజ్యం పేరిట అమాయకులను హింసించే వారిని హీరో ఏం చేశాడనేది చిత్ర కథ.