స్టూడెంట్స్ కు క్వాలిటీ ఫుడ్ పెట్టాలి : సరిత

గద్వాల, వెలుగు: సర్కార్  స్కూళ్లలో విద్యార్థులకు మిడ్​ డే మీల్స్ లో క్వాలిటీ ఫుడ్  పెట్టాలని జడ్పీ చైర్​పర్సన్  సరిత కోరారు. బుధవారం గట్టు మండలంలోని మాచర్ల హైస్కూల్ ను ఆమె తనిఖీ చేశారు. కిచెన్ షెడ్, క్లాస్ రూమ్స్ ను పరిశీలించారు. 

స్టూడెంట్స్ తో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్టూడెంట్స్ తో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అలాగే కేటిదొడ్డి మండలంలోని బాగుంట, చింతలకుంట విలేజ్ లలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాంత్ రెడ్డి, వరలక్ష్మి, ఆనంద్  పాల్గొన్నారు.