గద్వాల, వెలుగు: బీజేపీ లీడర్లకు రాహుల్ గాంధీ రావణుడిగా కనిపించినా భారతీయులందరికీ ఆత్మీయుడేనని జడ్పీ చైర్ పర్సన్ సరిత తెలిపారు. శనివారం సాయంత్రం రాహుల్ గాంధీ పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జడ్పీ క్యాంప్ ఆఫీస్ నుంచి వైఎస్సార్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ నిర్వహించి, మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్ వ్యక్తులకు దోచిపెడుతుందని ఆరోపించారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెబ్బేరు: దేశ ప్రజల మద్దతు పొందిన రాహుల్‌గాంధీని ఎదుర్కోలేక బీజేపీ వంకర మాటలతో ఎగతాళి చేస్తోందని వనపర్తి డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్ తెలిపారు. పార్టీ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో రాహుల్ గాంధీని ఎదుర్కోలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎద్దుల విజయవర్దన్ రెడ్డి, మన్యం, వీరస్వామి, వెంకట్రామిరెడ్డి, రాము, నరేందర్, ఆనంద్ సాగర్, చంద్రశేఖర్, ఈశ్వర్ పాల్గొన్నారు.