Sarkaru Noukari : ఊరు చివర బాక్స్ లో కండోమ్ ప్యాకెట్లు..ఆసక్తి కలిగిస్తోన్న సర్కారు నౌకరి టీజర్

సింగర్ సునీత(Sunitha) కొడుకు ఆకాష్(Akash)​ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నమూవీ.. సర్కారు నౌకరి(SarkaruNaukari).  దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు(KRaghavendraRao) ప్రొడ్యూసర్ గా గంగనమోని శేఖర్(ShekarGanganamoni)  డైరెక్షన్ చేస్తున్నారు. భావనా వళపండల్ హీరోయిన్‌‌గా పరిచయమవుతోంది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. 1996 కొల్లాపూర్ లో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా రూపొందించిన మూవీగా..టీజర్ స్టార్ట్ అయ్యింది.   

సర్కార్ నౌకరి చేసే అబ్బాయితో పెళ్లి కావాలని కలలు కన్న హీరోయిన్ కు..హీరో పరిచయం అయ్యే సీన్ తో ఆకట్టుకున్నారు. కాగా  ఆ రోజుల్లో గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే ఎంత విలువ ఉండేదో ఒక్క డైలాగ్ తో చూపించారు. ఈ మూవీలో  హీరో గవర్నమెంట్ మెడికల్ ఎంప్లాయిగా చూపించారు. అతడు ఊరు చివర బాక్స్ లో కండోమ్ ప్యాకెట్లను పెట్టడం..ఆ కండోమ్ ప్యాకెట్లను ఊర్లోని చిన్నపిల్లలు బూరలులాగా ఊదుకుంటూ ఆడుకోవడం.. ఊరంతో దాని గురించి చెప్పుకోవడం కూడా చూపించిన సీన్స్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. 

చివరికి అతడు చేసే ఉద్యోగం వల్లనో, మరే ఇతర కారణం వల్లనో ఊళ్లోకి రావద్దంటూ వార్నింగ్ ఇస్తూ టీజర్ ముగించారు. మరి ఎందుకు అతడిని ఊరులోకి రావొద్దన్నారు?  క్లారిటీగా ఏంటనేది రివీల్ చేయకపోవడంతో ఎంతో క్యూరియాసిటీ పెంచేశారు. ఈ నేచురల్ విజువల్స్, సురేష్ బొబ్బిలి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో టీజర్ ఆసక్తి కలిగిస్తోంది. 

ఈ మూవీని లెజెండరీ డైరెక్టర్ కే.రాఘవేంద్రరావుకు చెందిన ఆర్.కె టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ మూవీలో తనికెళ్ల భరణి, సాయి శ్రీనివాస్ వడ్లమాని, సూర్య, రాజేశ్వరి ముళ్లపూడి, తదితరులు ఇతర కీ రోల్ ప్లే చేశారు. శాండిల్య మ్యూజిక్ ఈ మూవీకు స్పెషల్  అసెట్ గా కనిపిస్తోంది. డైరెక్షన్,సినిమాటోగ్రఫీ బాధ్యతలు కూడా గంగనమోని శేఖర్ తన క్రీయేటివిటీ ని ప్రూవ్ చేసుకోబోతున్నారు. ఇక సింగర్ సునీత కొడుకైన ఆకాష్..ఈ మూవీతో ఫ్యాన్స్ ను ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి మరి.