సర్కారువారి పాట.. రిలీజ్కు ముందే జోష్..

స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హీరోల సినిమాల ప్రమోషన్ విషయంలో మేకర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోరు చూపి స్తున్నారు. రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి కొన్ని నెలల ముందు నుంచే జోష్ పెంచే స్తున్నారు. మహేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాబు హీరోగా రూపొందుతున్న ‘సర్కారు వారి పాట’ టీమ్ కూడా అదే చేస్తోంది. ఇటీవల రిలీజ్ చేసిన ‘కళావతి’ సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. తమన్ సంగీతం అందించగా  సిద్ శ్రీరామ్ పాడిన ఈ మెలొడీ.. ముప్ఫై అయిదు మిలియన్లకు పైగా వ్యూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఇటీవల ఈ పాట గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్. మహేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇమేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని కాకుండా పాత్రను దృష్టిలో ఉంచుకుని పాట రాశానన్నాడు. 
అయితే కాస్త డీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వెళ్లి డిటెయిల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చెప్పడంతో ఇన్ని రోజులూ సీక్రెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా దాచిన మహేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యారెక్టర్ రివీల్ అయిపోయింది. ఈ మూవీలో హీరో అనాథట. చాలా మొండివాడు కూడానట. ఎప్పుడూ గొడవలు పడుతూ, అమ్మాయిల్ని అస్సలు పట్టించుకోని అతగాడు.. ఒక్కసారిగా హీరోయిన్ ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? ఆ యాంగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఈ పాట రాశానన్నాడు అనంత్ శ్రీరామ్. అనుకోకుండా ఆయన లీక్ చేసిన ఈ విషయాలతో మహేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాత్ర గురించి క్లారిటీ వచ్చేసింది. కీర్తి సురేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సముద్రఖని, ప్రకాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజ్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జీఎంబీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్మెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఎనభై శాతం షూటింగ్ పూర్తయింది. మే 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.