సినీ ఇండస్ట్రీలో బ్యూటీఫుల్ హీరోయిన్స్ని చూస్తుంటాం..ఇష్టపడుతుంటాం.కానీ, సింగర్స్లో బ్యూటీఫుల్ అండ్ మెస్మరైజింగ్ వాయిస్తో పేరు తెచ్చుకున్న హారిక నారాయణ్(Harika Narayan) అంటే తెలియని వారుండరేమో! స్వరాభిషేకంలో కోరస్ సింగర్‌గా మొదలై..టీవీ షోలలో, ప్రైవేట్ ఆల్బమ్స్ తో తన పాటలతో అలరించింది. తెలుగు తమిళ్ లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడి మెప్పించింది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే హారిక..తాజాగా నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలను షేర్ చేసింది. గత ఏడేళ్లుగా ఓ అబ్బాయిని ప్రేమిస్తున్న హారిక నారాయణ్..త్వరలో పెళ్లి పీటలెక్కబోతుంది. పృథ్వినాథ్ వెంపటి అనే వ్యక్తితో ప్రేమలో ఉన్న హారిక తన నిశ్చితార్థంకి సంబంధించిన ఫోటో ఒకటి తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..మన ఏడేళ్ల అందమైన ప్రయాణం..ఇప్పుడు మరో లెవల్ కు తీసుకెళ్తున్నాం..అని స్పెషల్ పోస్ట్ చేసింది. త్వరలోనే ఈ జంట పెళ్లి డేట్ ని ప్రకటించే అవకాశం ఉంది.
ALSO READ :- కంటతడి పెట్టిన షర్మిల: ప్రత్యేక హోదా కోసమే రాష్ట్రంలో అడుగుపెట్టా..!
హారిక నారాయణ్ సూర్యకాంతం మూవీలోని "ఫ్రైడే నైట్ బేబీ" సాంగ్ తో సినీ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత ఆమె ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ (టైటిల్ సాంగ్), మిస్ ఇండియా (మిస్ ఇండియా థీమ్), బ్లాక్ రోజ్ (నా తప్పు ఏమున్నదబ్బా సాంగ్), ఆచార్య (లాహే లాహే పాట), మరియు సర్కారు వారి పాట టైటిల్ ట్రాక్ పాడి దుమ్మురేపింది. ఈ పాట బాగా హిట్ అయ్యింది.