
న్యూఢిల్లీ: ఏరోస్పేస్ స్టార్టప్ సర్లా ఏవియేషన్ ఎయిర్ ట్యాక్సీ కమర్షియల్ సర్వీస్‌లను త్వరలో లాంచ్ చేస్తామని ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభంలో ‘శూన్య’ పేరుతో ఎయిర్ ట్యాక్సీ ప్రోటోటైప్‌ను కంపెనీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే.
‘వికసిత్ భారత్’ కార్యక్రమంలో భాగంగా ఎయిర్ టాక్సీలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని కంపెనీ సీఈఓ అడ్రియన్ అన్నారు. పాఠశాలలు, మాల్స్, ఆసుపత్రులు, విమానాశ్రయాల వంటి ప్రదేశాలకు రాకపోకలు సాగించడానికి ఎయిర్ టాక్సీలను ఉపయోగించొచ్చన్నారు.
సర్లా ఏవియేషన్ ఇప్పటివరకు వివిధ వెంచర్ క్యాపిటల్ సంస్థలు, ఏంజెల్ ఇన్వెస్టర్ల నుంచి 12 మిలియన్ డాలర్లను సేకరించింది. బిజినెస్‌ను విస్తరించడానికి అదనపు పెట్టుబడులను సేకరించాలని కూడా ఆలోచిస్తోంది.