
మదనాపురం, వెలుగు: సరళ సాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు భారీగా రావడంతో మంగళవారం రాత్రి ప్రాజెక్ట్ లోని ఆటోమెటిక్ సైఫన్లు ఓపెన్ అయ్యాయి. వరదనీటికి ప్రాజెక్టులో 2 హుడ్ సైఫన్లు, ఒక ప్రైమ్ సైఫన్లు ఓపెన్ అయ్యాయని అధికారులు తెలిపారు. దీని ద్వారా ఐదువేల క్యూసెక్కుల వరదనీరు ఊకచెట్టు వాగు నుంచి రామన్ పాడు కు చేరుతుందన్నారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఏఈ రనిల్ రెడ్డి తెలిపారు.