ఐటీ సోదాల్లో రెండు చిప్పలు దొరికినయ్.. ఒకటి కేసీఆర్​కు, ఇంకోటి బాల్క సుమన్​కు : సరోజా వివేక్

  • ఒకటి కేసీఆర్​కు, ఇంకోటి బాల్క సుమన్​కు : సరోజా వివేక్

కోల్ బెల్ట్, వెలుగు: ‘బీఆర్​ఎస్ ​పార్టీకి ఓటమి భయం పట్టుకుంది.. అందుకే కావాలనే ఐటీ రెయిడ్స్​చేయిస్తున్నారు’ అని చెన్నూర్ కాంగ్రెస్​అభ్యర్థి, మాజీ ఎంపీ​ వివేక్ వెంకటస్వామి సతీమణి సరోజ విమర్శించారు. ‘మా ఇండ్లు, సంస్థలపై కేసీఆర్, బాల్క సుమన్ ఐటీ,ఈడీ రైడ్స్ చేయించారు.. సోదాల్లో రెండే చిప్పలు దొరికాయి.. వాటిలో ఒకటి కేసీఆర్, మరొకటి బాల్క సుమన్ తీసుకోవాలి’’ అని ఆమె ఎద్దేవా చేశారు.

బుధవారం వివేక్ తరఫున సరోజా వివేక్.. మంచిర్యాల జడ్పీ చైర్​ పర్సన్ ​నల్లాల భాగ్యలక్ష్మితో కలిసి మందమర్రిలోని రాజీవ్ నగర్ , శాంతి నగర్ లో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చెన్నూర్​ నియజకవర్గంలో కాకా వెంకటస్వామి, వివేక్ వెంకటస్వామి, వినోద్ హయాంలో వేసిన రోడ్లే ఇప్పటికీ ఉన్నాయి తప్ప బీఆర్ఎస్​ హయాంలో కొత్తగా వేసిన రోడ్లేవీ లేవన్నారు. ‘100 కేసులు నావి..100 కోట్లు వివేక్ వి’ అంటూ గతంలో  చెప్పుకున్న బాల్క సుమన్ కు ఇప్పుడు వెయ్యి కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.

ALSO READ  :పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేయాలి : సంజయ్ కుమార్