
*హైదరాబాద్ సంస్థానంలో తొలి తెలుగు పత్రిక సరోజినీ విలాస్. ఇది మహబూబ్ నగర్ జిల్లా నుంచి వెలువడింది. ఈ పత్రికను1912లో శ్రీనివాస్ శర్మ స్థాపించారు.
* 1917లో దివ్యజ్ఞాన సమాజానికి చెందిన స్వామి వెంకటరావు ఆంధ్రమాత పత్రికను స్థాపించారు.
* 1924 ఆగస్టు 24న షబ్నవీసు వెంకటరామ నరసింహారావు సంపాదకత్వంలో నల్లగొండలో నీలగిరి అనే వార పత్రిక ప్రారంభమైంది. ఇది హైదరాబాద్ సంస్థానంలో తొలి పూర్తిస్థాయి రాజకీయ తెలుగు పత్రిక.
* 1922 ఆగస్టు 27న వరంగల్ జిల్లా మానుకోట తాలుకా ఇనుగుర్తి నుంచి తెనుగు అనే వారపత్రిక వెలువడింది. ఈ పత్రిక సంపాదకులు వొద్దిరాజు సీతారామచంద్రరావు, రాఘవరంగారావు సోదరులు.
* 1920లో ఆంధ్రాభ్యుదయం, దేశబంధు పత్రికలు వెలువడ్డాయి.
*1923లో వరంగల్ నుంచి ముదిగొండ వీరభద్రశాస్త్రి సంపాదకత్వంలో శైవ ప్రచారిణి అనే మాస పత్రిక ప్రారంభమైంది.
* 1925లో సికింద్రాబాద్ నుంచి ఆంగ్ల–తెలుగు ద్విభాష పత్రిక ‘నేడు’ వెలువడింది. ఈ పత్రికను భాస్కర్ ప్రచురించారు.
* గోల్కొండ పత్రికకు సురవరం ప్రతాపరెడ్డి 1926 నుంచి 1946 వరకు సంపాదకులుగా పనిచేశారు.
* గోల్కొండ పత్రిక కంటే ముందు తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమం, నిజామాంధ్ర ఉద్యమాన్ని నీలగిరి, తెనుగు పత్రికలు ప్రోత్సహించాయి.
* 1927లో పీఎస్ శర్మ సంపాదకత్వంలో సుజాత అనే పత్రిక వెలువడింది.
* 1924లో సికింద్రాబాద్ నుంచి ఆంధ్రకేసరి అనే ఆంగ్ల–తెలుగు వారపత్రికను అడుసుమిల్లి దత్తాత్రేయ శర్మ ప్రచురించారు.
* వడ్డేపల్లి గ్రామం నుంచి వెలువడిన దేశబంధు మాసపత్రికకు బెల్లంకొండ రామానుజాచార్యులు, నరసింహాచార్యులు సంపాదకత్వం వహించారు.
* నల్లగొండ జిల్లా రామన్నపేట తాలుకా వలిగొండకు చెందిన బిఎస్ శర్మ విజయవాడ నుంచి తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాషల్లో ఆంధ్రవాణి పత్రికను వెలువరించారు.
* 1929లో హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ బులెటిన్ అనే పత్రికను బుక్కపట్టణం రామానుజాచార్యులు ప్రారంభించారు.
* 1925లో భాగ్యనగర్ పత్రికను ప్రముఖ సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ స్థాపించారు. ఈ పత్రిక తర్వాతి కాలంలో ఆది హిందూ వారపత్రికగా వెలువడింది.
* విభూతి పత్రికకు వీరభద్రశర్మ సంపాదకత్వం వహించారు.
* వరంగల్ నుంచి దేవులపల్లి రామానుజాచార్యులు సంపాదకత్వంలో శోభ పత్రిక వెలువడింది.
* 1942లో రామానుజాచార్యుల సంపాదకత్వంలో తెలంగాణ పత్రిక వెలువడింది. ఈ పత్రికలో చార్మినార్ గాసిప్ శీర్షిక కింద అంత:పురంలోని విషయాలు,
* 1937లో దక్కన్ క్రానికల్ వార పత్రికను రామానుజాచార్యులు, రాజగోపాల్ కలసి స్థాపించారు. ఈ పత్రికకు సంపాదకుడు రామానుజాచార్యులు. దక్కన్ క్రానికల్ 1939లో దినపత్రికగా మారింది.
* 1934లో సికింద్రాబాద్ నుంచి దక్కన్ కేసర్ అనే ద్విభాషా పత్రికను దత్తాత్రేయ శర్మ ప్రచురించారు.
* సికింద్రాబాద్ నుంచి తెలుగు తల్లి పత్రికను రాచముళ్ల సత్యవతీ దేవి ప్రచురించారు.
* 1937లో దివ్వవాణి పత్రికను అప్పయ్యశాస్త్రి ప్రచురించారు.
* 1945లో చెల్లా సుబ్బారావు ప్రచురించిన పత్రిక తరణి.
* ది ఆంధ్రకేసరి అనే పత్రిక కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో వెలువడింది.
* కలకత్తాకు చెందిన గులాం మహమ్మద్ హైదరాబాద్లో మూడు భాషల్లో మూడు పత్రికలను మీజాన్ పేరిట ప్రారంభించారు. తెలుగు మీజాన్ పత్రిక సంపాదకులు అడవి బాపిరాజు.
* మందముల నర్సింగరావు సంపాదకత్వంలో రయ్యత్ పత్రిక వెలువడింది.
* ఇమ్రోజ్ పత్రిక స్థాపకుడు షోయబుల్లాఖాన్. ఈ ఉర్దూ పత్రిక రజాకార్ల అరచకాలు, దౌర్జన్యాలను తీవ్రంగా విమర్శించింది.