ప్రోటోకాల్ రగడ.. సర్పంచ్, ఎంపీటీసీ అరెస్టు

ప్రోటోకాల్ రగడ.. సర్పంచ్, ఎంపీటీసీ అరెస్టు

సర్పంచ్ ని అరెస్టు చేసి పోలీసు స్టేషన్ లో పెట్టడం బెకర్ పని అంటూ.. పాలమూరు ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేట గ్రామ నూతన గ్రామపంచాయతీ భవన ప్రారంభోత్సవ వివాదం రగడ రాజకుంది. కొత్తపేట సర్పంచ్ నవీన్, ఎంపిటీసీ మల్లేష్ ను అరెస్ట్ చేయడంతో ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్య అక్కడికి చేరుకున్నారు. వారితో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు పోలీస్ స్టేషన్ కు రావడంతో ఆందోళన నెలకొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఎంపీ శ్రీనివాస్ రెడ్డి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. 

సర్పంచ్, ఎంపీటీసీని అరెస్టు చేయడం తప్పని.. వారిని ఎందుకు అరెస్ట్ చేశారని ఎంపీ ప్రశ్నించారు. దీంతో రూరల్ సీఐ లక్ష్మీరెడ్డి వారికి నచ్చచెప్పుతూ.. అధికారులు ఫిర్యాదు చేశారని వివరించారు. సంబంధిత భవనం విషయంలో లాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పే అవకాశం ఉంది కాబట్టి.. ముందస్తు చర్యగా అదుపులోకి తీసుకుందామని చెప్పామని.. కాగా ఈ విషయంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కల్పించుకొని ఆగ్రహం వ్యక్తం చేశారని అందుకే తెలిపారు.

ఈ విషయంలో జిల్లా కలెక్టర్ తో మాట్లాడుతున్నట్టు ఎంపీ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. అయితే ఘటన స్థలంలో మాత్రం ఆందోళనకారులు సర్పంచ్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇరువర్గాల మధ్య వాగివాదం కొనసాగుతోంది. ఈ నేపద్యంలో మీరేం చేసుకుంటారో చేసుకోండి గ్రామపంచాయతీ భవనానికి కొబ్బరికాయ కొడతామంటూ వారు అన్నారు. సర్పంచ్ ను అడ్డగించిన వారిపై కేసులు పెట్టాలి అంటూ ఎంపీ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సైబరాబాద్ కమిషనర్ కు ఎంపీ ఫోన్ చేసి మాట్లాడారు..