రేగొండ, వెలుగు : తమ సమస్యలు పరిష్కరించాలని పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తుండడంతో గ్రామానికి సంబంధించిన అన్ని పనులు పాలకవర్గ సభ్యులపై పడ్డాయి. పంప్ ఆపరేటర్ పని మొదలుకొని చెత్తను ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డుకు తరలించే పని వరకు అంతా వారే చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం జగ్గయ్యపేట సర్పంచ్ సంతోష్ గురువారం
ట్రాక్టర్‌లో హరితహారం మొక్కలు పెట్టుకొని తానే స్వయంగా నడుపుకుంటూ వెళ్లి ఇంటింటికీ మొక్కలు సప్లై చేశారు. కార్మికుల సమ్మెలో ఉండడంతో తాము పనులు చేసుకోక తప్పడం లేదని ఆయన వాపోయారు.