కరీంనగర్, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్ధులు తమ డిపాజిట్ డబ్బులు తిరిగి ఇవ్వాలని అధికారులను కోరుతుండగా రేపూమాపంటూ వారిని ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటున్నారు . ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 20 శాతం మందికి కూడా డిపాజిట్ డబ్బులు ముట్టలేదు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం..నెల రోజుల తరవాత డిపాజిట్ డబ్బులు వాపసివ్వాలి. కానీ ఇంకా ఎక్కడా అభ్యర్ధులకు డబ్బులిచ్చినట్టు కనిపించడంలేదు. ఈ సారి సర్పంచి ఎన్నికల్లో చాలా మంది ఉత్సాహంగా పాల్గొన్నారు . ఒక్కో జీపీలో సర్పం చ్ పదవులకు 10 నుంచి 15 మంది పోటీ పడ్డా రు. వార్డుల్లో కూడా ముగ్గురు నుంచి ఐదుగురు పోటీ పడ్డా రు. దీంతో డిపాజిట్ రూపంలో రూ.లక్షల్లో నిధులు జమయ్యాయి. ఓసీ, బీసీ లు సర్పంచ్ గా పోటీ చేస్తే రూ.2వేలు, ఎస్సీ, ఎస్టీలు రూ.వెయ్యి డిపాజిట్ గా కట్టాలి. వార్డు మెంబర్ గా పోటీచేసిన అభ్యర్థి ఓసీ, బీసీ అయితే రూ.500, ఎస్సీ, ఎస్టీలు రూ.250 చొప్పున కట్టాలి. డిపాజిట్ సొమ్మును ఎన్నికల అధికారులు ఏ రోజుకారోజు మండల పరిషత్ అధికారులకు అప్పగిం చారు. పోలైన ఓట్లలో ఎనిమిదో వంతు ఓట్లు ఓట్లు దక్కితేనే పోటీచేసిన అభ్యర్థికి డిపాజిట్ డబ్బులు తిరిగి చెల్లిస్తారు లేదంటే ప్రభుత్వానికి జప్తు చేస్తారు. ఈ డబ్బు కూడా నెల రోజుల్లో తిరిగి చెల్లిం చాలి. కానీ అధికారులు కావాలనే ఆలస్యం చేస్తున్నారని అభ్యర్థులు అంటున్నారు . అయితే ఎన్నికల సమయంలో ఖర్చుల నిమిత్తం డబ్బులు పూర్తి స్థాయిలో విడుదల కాలేదు. దీంతో డిపాజిట్ చేసిన సోమ్మునే ఎన్నికల కోసం ఖర్చు చేశారని.. అందుకే అభ్యర్థులకు డబ్బులు వెనక్కి ఇచ్చేం దుకు ఆలస్యం అవుతుందని సమాచారం.
వరంగల్ రూరల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1680 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. 349 పంచాయతీల్లో సర్పం చులు ఏకగ్రీవం కాగా మిగిలిన చోట్ల భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేశారు. నెల రోజుల్లో నే డిపాజిట్ డబ్బులు వాపసు చేలాల్సి ఉంది,కానీ ఇంకా ఎక్కడా డబ్బులు ఇవ్వలేదు. అభ్యర్ధులు పంచాయతీ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయారు. చాలా మంది ఆ డబ్బుల మీద ఆశలు వదులుకున్నట్టు చెప్తున్నారు .
మెదక్ : ఎన్నికలు పూర్తయి రెండునెలలయినా తమ డిపాజిట్ డబ్బులు వెనక్కి ఇవ్వడంలేదని, అసలు ఇస్తారా? ఇయ్యరా? అని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు . నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్న వారికి అదే రోజు డిపాజిట్ పైసలు తిరిగి ఇచ్చేశారు. కానీ ఎన్నికల్లో పోటీచేసిన క్యాండిడేట్ లు డిపాజిట్‌డబ్బుల కోసం ఆఫీస్ ల చుట్టూ తిరుగుతు న్నారు .ఆయా ఎంపీడీఓ ల దగ్గర ఉన్న డిపాజిట్ మొత్తాన్ని సంబంధిత పంచాయతీ అకౌంట్ లలో జమచేసి కార్యదర్శుల ద్వారా క్యాండిడేట్ లకు వాపసు చేయాలి.కొన్నిచోట్ల ఎంపీడీఓలు పంచాయతీ కార్యదర్శుల ద్వారా సర్పం చ్ , వా ర్డు మెంబర్ క్యాండిడేట్ లకు డిపాజిట్ పైసలు తిరిగి చెల్లిం చారు. కానీ చాలాచోట్ల డిపాజిట్ అలా జరగలేదు. ప్రభుత్వం నుంచి నిధులు రాగానే డిపాజిట్ పైసలు చెల్లిస్తా మని చెబుతున్నారు .కొన్ని చోట్ల పంచాయతీ ఖాతాలో జమ అయిన డబ్బులను కార్యదర్శులు ఇవ్వడంలేదంటున్నారు. డిపాజిట్ తిరిగి వస్తుం దన్న అవగాహన లేని కొం దరు అసలు అడగడమే లేదని తెలుస్తోం ది.