సర్పంచ్ ల తిప్పలు: పైసలున్నా పవర్ లేదు!

సర్పంచ్ ల తిప్పలు: పైసలున్నా పవర్ లేదు!

చెక్‌ పవర్‌ లేక ఇబ్బందులు పడుతున్న సర్పంచ్‌ లు.. అకౌంట్‌ లో నిధులున్నావాడుకోలేని పరిస్థితిచేసేది లేక సొంత ఖర్చులతో ఊళ్లో పనులు.. సిబ్బంది జీతాలకూ కటకట..చెక్ పవర్ పై చట్టం తెచ్చినా ఇంకా రాని ఉత్తర్వులు.. నిరసనగా భిక్షాటనకు దిగుతున్న సర్పంచ్‌ లు

పంచాయతీ ఎన్నికల్లో గెలిచి మూడు నెలలవుతున్నా చెక్ పవర్ఇవ్వకపోవడంపై సర్పంచ్‌ లునిరసనలకు దిగుతున్నారు. నిధులున్నా వాడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెక్ పవర్ ఇవ్వనందుకు నిరసనగా ఇటీవల కరీంనగర్ జిల్లాలో మన్నెంపల్లి గ్రామసర్పంచ్ అంజయ్య భిక్షాటన చేశారు.

పంచాయతీ ఎన్నికల్లో గెలిచి మూడు నెలలవుతున్నా చెక్ పవర్ ఇవ్వకపోవడంపై సర్పంచ్‌‌‌‌లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిధులు విడుదలైనా వాటిని వాడలేకపోతున్నామని, ప్రచారంలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.500 కోట్లకుపైనే 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదలైనా పంచాయతీ కార్యదర్శులు లేకపోవటంతో అవన్నీ ట్రెజరీలోనే నిలిచిపోయాయి. చెక్పవర్ ఇవ్వనందుకు నిరసనగా ఇటీవల కరీంనగర్ జిల్లాలో మన్నెంపల్లి సర్పంచ్ అంజయ్య, గంభీరావ్‌ పేట సర్పంచ్‌‌‌‌ శ్రీధర్‌ భిక్షాటన చేశారు.

సొంత ఖర్చులతో పనులు
ఈ ఏడాది ఫిబ్రవరి 2న రాష్ట్రవ్యాప్తంగా కొత్త సర్పంచ్‌‌‌‌లు ప్రమాణం చేశారు. వారికి ఊళ్లలో సమస్యలుస్వాగతం పలికాయి. గతేడాది ఆగస్టు నుంచి ప్రత్యేకాధికారుల పాలనలో ఉండడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. కొత్త సర్పంచ్‌‌‌‌లు పగ్గాలు చేపట్టగానే ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి. నీళ్ల గేట్ వాల్వ్‌‌‌‌లు లీకవటం, స్ట్రీట్‌‌‌‌ లైట్లు సరిగ్గాలేకపోవటం, డ్రైనేజీల్లో చెత్త పేరుకపోవటం వంటిసమస్యలను వారి ముందుంచారు. దీంతో సర్పంచ్‌‌‌‌గా గెలిచామన్న ఉత్సాహంలో చేతిలోంచి డబ్బులు ఖర్చు పెట్టారు. కొత్తగా ఏర్పడ్డ పంచాయతీలకు ఆఫీసులను అద్దె భవనాల్లో ఏర్పాటు చేశారు.వాటిలో చిన్నచిన్న మరమ్మతులు, ఫర్నీచర్ కొనుగోలుకు ఖర్చు పెట్టారు. ఇప్పుడు నెలలు గడుస్తున్నాచెక్ పవర్ రాకపోవటంతో వారంతా నిరుత్సాహ పడుతున్నారు.

సిబ్బందికి జీతాలెట్లా ?
చిన్న పంచాయతీల్లో ఇద్దరు, ముగ్గు రు, పెద్ద పం-చాయతీల్లో అయితే 10 మంది దాకా సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో కారోబార్లు, బిల్ కలెక్టర్లు , విద్యుత్మెకానిక్‌‌‌‌లు, పంప్ ఆపరేటర్లు, డ్రైనేజీలు శుభ్రం చేసేవారుంటా రు. వసూలైన పన్నులను పంచాయతీ ఖాతాలో జమ చేస్తుంటారు. ప్రభుత్వం నుంచినిధులు రాకపోవటంతో సిబ్బంది వేతనాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో చేసేది లేక వసూలైన పన్నుల నుంచి సిబ్బంది జీతాలకు ఖర్చు చేస్తున్నారు.

చట్టం తెచ్చినా ఆదేశాల్లేవ్
గతంలో సర్పంచ్ లకు, పంచాయతీ కార్యదర్శులకు కలిపి చెక్ పవర్ ఉండేది. కార్యదర్శుల కొరతతోమూడు నాలుగు గ్రామాలకు కలిపి ఒకరిని నియమిం చారు. సమయం తక్కువగా ఉండటం, పంచాయతీలు ఎక్కువ ఉండటం, సమన్వయం లోపంకారణంగా సర్పంచ్ లకు, కార్యదర్శులకు మధ్యవివాదాలు ఏర్పడ్డాయి. దీంతో ప్రభుత్వం గతేడాది తెచ్చిన పంచాయతీ రాజ్ చట్టం –2018లో సర్పంచ్లు, ఉప సర్పంచ్ లకు చెక్ పవర్ అధికారాన్ని కల్పించింది . కానీ దీనిపై ఆదేశాలు జారీ చేయకపోవటంతో నిధులు నిలిచిపోయాయి. ప్రమాణం చేయగానే దీనిపై ఆదేశాలిస్తే పల్లెల్లో చిన్న చిన్న పనులైనా జరిగేవని, సమస్యలు తీరేవని సర్పంచ్ లు అంటున్నారు.అయితే కార్యదర్శులు లేకుండా సర్పంచ్ లకు, ఉపసర్పంచ్ లకు చెక్ పవర్ ఇస్తే నిధులు దుర్వినియోగం అవుతాయని, అందుకే ఇవ్వలేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

మరుగుదొడ్ల బిల్లులకు బ్రేక్
కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ లో భాగంగా గ్రామాల్లో టాయిలెట్ల నిర్మాణానికి రూ.12 వేలు చెల్లిస్తోంది . నిర్మాణం ప్రారంభించే సమయంలో రూ.6 వేలు, పూర్తయిన తర్వాత మరో రూ.6వేలు ఇస్తున్నారు. వీటి పనులను ఉపాధి హామీపథకం అధికారులు తనిఖీ చేసి పంచాయతీఖాతాలో లబ్ధిదారుల నిధులు జమ చేస్తున్నారు.ఇప్పుడు ఈ బిల్లులకు కూడా బ్రేక్ పడింది.

ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలె
పంచాయతీ రాజ్ చట్టంలో సర్పంచ్, ఉపసర్పంచ్ లకు కలిపి చెక్ పవర్ అధికారాన్ని ఇచ్చారు. కానీ ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందలేదు.
– రామారావు, డిప్యూటీ కమిషనర్,పంచాయతీ రాజ్ శాఖ