![ప్రత్యర్థి రూ.10 వేలు ఇస్తే.. నేను రూ.20 వేలు ఇస్తా.. హీటెక్కిన సర్పంచ్ ఎన్నికలు..!](https://static.v6velugu.com/uploads/2025/02/sarpanch-elections-have-started-to-heat-up_sI0F2xK371.jpg)
గరిడేపల్లి, వెలుగు: సూర్యాపేట జిల్లాలో సర్పం చ్ ఎన్నికలకు ముందే పాలిటిక్స్ హీటెక్కాయి. గరిడేపల్లి మండలం గారకుంట సర్పంచ్ పదవిని కొద్ది రోజుల కింద వేలం వేయగా.. గుగులోతు రవి నాయక్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో అతను ఓటర్లకు ఆఫర్లు ఇస్తూ.. ఒక అభ్యర్థి ఓటుకు రూ.10 వేలు ఇస్తే.. తాను రూ. 20 వేలు ఇస్తా.. రూ. 30 వేలు ఇస్తే.. రూ.60 వేలు ఇస్తానంటూ బహిరంగంగా ప్రకటించాడు.
గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి కావాలా, సేవాలాల్ మహరాజ్ గుడి కావాలా, సాయిబాబా గుడి కావాలా? అంటూ ఓటర్లకు ఆఫర్ ఇచ్చాడు. తన ఎకరం భూమిని అమ్మకానికి పెట్టానని, తగ్గేదేలే అంటూ.. రవి నాయక్ చాలెంజ్ చేశారు. గ్రామ ఓటర్లు ఆశీర్వదించి సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని.. లేదంటే పోటీకైనా రెడీనే అంటూ స్పష్టంచేశారు. దీంతో అప్పుడే సర్పంచ్ ఎన్నికలు హీటెక్కాయని, క్యాండిడేట్లు ఇప్పటికే ఆస్తులు అమ్ముకొని సిద్ధంగా ఉన్నారనే చర్చ గ్రామ పంచాయతీల్లో జోరుగా నడుస్తోంది.