భారీ వానకు కూలిన సర్పంచ్​ ఇల్లు.. తప్పిన ప్రాణాపాయం

నవీపేట్, వెలుగు: గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నిజామాబాద్​ జిల్లా నవీపేట్  ​మండలం మోకాన్​పల్లి సర్పంచ్​సుధాకర్ ​పెంకుటిల్లు కూలిపోయింది. సుధాకర్​ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో రెండు గదులున్న పెంకుటింట్లో ఉంటున్నాడు. గృహలక్ష్మి పథకం అమల్లోకి వస్తే ప్రభుత్వం రూ.3 లక్షలు ఇస్తుందని, దాంతో ఇల్లు కట్టుకుందామని అనుకున్నాడు. కానీ, ఇంతవరకు అమలుకాకపోవడంతో చేసేదేమీ లేక పెంకుటింట్లోనే ఉంటున్నాడు. గురువారం రాత్రి కురిసిన వర్షానికి వంటరూమ్​పై భాగం పూర్తిగా కూలిపోయింది. భార్యభర్తలు పక్కగదిలో నిద్రించడం వల్ల ప్రాణాపాయం తప్పింది.