మానవపాడు ఇండ్ల స్థలాల కోసం వినతి: లక్ష్మీదేవి

మానవపాడు, వెలుగు : తుంగభద్ర నది వరదల్లో 2009లో సర్వం కోల్పోయిన తమకు వెంటనే ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సర్పంచ్​ లక్ష్మీదేవి, గ్రామస్తులు కోరారు. మంగళవారం తహసీల్దార్  జుబేరా మైనుద్దీన్ కు వినతిపత్రం అందించారు. 14 ఏండ్లుగా ఇండ్ల స్థలాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్ల స్థలాల కోసం మద్దూరు గ్రామంలో 32 ఎకరాల స్థలాన్ని సేకరించారని, ప్రభుత్వం లేఔట్  చేయలేదన్నారు. 

ఈ స్థలంలో ముళ్ల పొదలను తొలగించుటకు లబ్ధిదారులే చందాలు వేసుకుని శుభ్రం చేస్తున్నారని, దీన్ని లంచంగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. గ్రామానికి చెందిన ఓ వర్గం వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం సరైంది కాదన్నారు. ఎన్నికల కోడ్  రాకముందే తమకు ఇండ్ల స్థలాలు కేటాయించి, పట్టాలు ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.