గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసిన సర్పంచ్ 

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయానికి సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి తాళం వేశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు మద్దతు తెలుపుతూ.. ఆయన పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి.. నిరసన తెలిపారు. ఇన్ చార్జ్ సెక్రటరీ వద్దు.. మా సెక్రెటరీ మాకే కావాలని సర్పంచ్ కోరుతున్నారు. సీఎం కేసీఆర్ పెద్ద  మనసుతో జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.