పెనుబల్లి, వెలుగు: పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసిన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కర్రాలపాడు సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ సస్పెండ్అయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్బుధవారం చర్యలు తీసుకున్నారు. ఉప సర్పంచ్ఆళ్ల కృష్ణ సంతకం లేకుండా సర్పంచ్ రాయపూడి మల్లయ్య, పంచాయతీ సెక్రటరీ ఇందిర కలిసి రూ.6లక్షల44వేల490 పంచాయతీ నిధులను దుర్వినియోగం చేశారు. ఉప సర్పంచ్ఫిర్యాదుతో గతనెల 9న డీఎల్పీఒ ప్రభాకర్ విచారణ చేపట్టారు. అనంతరం కలెక్టర్గౌతమ్ కు రిపోర్టు అందజేశారు. బుధవారం సర్పంచ్, సెక్రటరీని సస్పెండ్చేస్తూ కలెక్టర్ఉత్తర్వులు ఇచ్చారు. జీపీ ఫండ్స్ రికవరీ చేయాలని ఆదేశించారు.
మెదక్లో ఇద్దరు సర్పంచులు..
మెదక్ జిల్లాలో ప్రొటోకాల్ పాటించని ఇద్దరు సర్పంచులు సస్పెండ్ అయ్యారు. నిజాంపేట మండలం జడ్చెరువు తండాలో పంచాయతీ భవనం, చిన్న శంకరంపేట మండలం చందంపేటలో పల్లె దవాఖాన ప్రారంభోత్సవంలో ప్రొటోకాల్ పాటించలేదని అందిన ఫిర్యాదుతో మెదక్కలెక్టర్చర్యలు తీసుకున్నారు. ఆయా గ్రామాల సర్పంచులు రమావత్ అరుణ్ కుమార్, తాటికొండ శ్రీలతను సస్పెండ్ చేస్తున్నట్లు డీపీఓ ఉత్తర్వులను జారీ చేశారు.