పల్లెప్రగతి సమావేశాన్ని బహిష్కరించిన సర్పంచులు

 పల్లెప్రగతి సమావేశాన్ని బహిష్కరించిన సర్పంచులు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 5వ విడత పల్లెప్రగతికి సర్పంచుల నిరసన సెగ తగులుతోంది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో పల్లె ప్రగతి సన్నాహక సమావేశాన్ని సర్పంచులు బహిష్కరించారు. మొదట ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ కార్డులు, పింఛన్లు ఇప్పించే పరిస్థితిలో తాము లేమని సర్పంచులు వాపోయారు. కాగా రాష్ట్రంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు సర్పంచులు. పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించకుండా 5వ విడత ప్రగతి పనులు చేపట్టేది లేదంటే తేల్చిచెప్పారు. 

మరిన్ని వార్తల కోసం

శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టివేత

కోతుల మధ్య ఆప్యాయత..మనుషులను మించి..