నిధుల కోసం సర్పంచుల నిరసన

గ్రామ పంచాయతీలకు నిధులివ్వక, కేంద్రం ఇచ్చే నిధులను మళ్లిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న కేసీఆర్ సర్కారుపై సర్పంచులు పోరాటానికి సిద్ధమయ్యారు. పలు జిల్లాల్లో ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హన్మకొండ కలెక్టరేట్ ఎదుట సర్పంచులు ధర్నాకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం 9 నెలలుగా ఫండ్స్ రిలీజ్ చేయకపోవడంపై ఆందోళన చేపట్టారు. కేసీఆర్ సర్కారు తమ జీవితాలతో ఆడుకుంటోందని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను వెంటనే రిలీజ్ చేయాలంటూ సర్పంచులు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం స్పందించకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సర్పంచుల నిరసనను పోలీసులు అడ్డుకున్నారు.