సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇవ్వాలి: అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ఎదుట జేఏసీ నిరసన

సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇవ్వాలి: అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ఎదుట జేఏసీ నిరసన

ట్యాంక్ బండ్, వెలుగు: సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ రాష్ట్ర సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ మంగళవారం ఎన్టీఆర్ గార్డెన్ వద్ద ఉన్న అతి పెద్ద అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలిపింది. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్  మాట్లాడుతూ గ్రామాల్లో వడ్డీలకు డబ్బులు తెచ్చి, గ్రామాలు అభివృద్ధి  చేసిన సర్పంచులు అప్పుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. దిక్కు లేని పరిస్థితుల్లో చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారిని కాపాడాలని  విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు రాపాక నాగయ్య, మధుసూదన్ రెడ్డి, మల్లయ్య, గణేశ్​, బీరప్ప, పద్మా రెడ్డి, రవి  పాల్గొన్నారు.